Begin typing your search above and press return to search.
చిన్న సినిమాలకు ఏపీ ప్రభుత్వం బంపరాఫర్
By: Tupaki Desk | 21 Aug 2018 4:20 PM GMTఆంధ్రప్రదేశ్ లో చిత్రీకరణ జరుపుకునే చిన్న సినిమాలకు అక్కడి ప్రభుత్వం పెద్ద చేయూత అందించడానికి ముందుకు వచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో చిన్న సినిమాకు రూ.10 లక్షల మేర ప్రయోజనం కలగనుంది. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లోనే చిత్రీకరణ జరుపుకుని.. అక్కడే పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకున్న చిత్రానికి రూ.10 లక్షల మేర జీఎస్టీ వెనక్కి ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. రూ.4 కోట్ల లోపు బడ్జెట్లో తెరకెక్కిన సినిమాలకే ఇది వర్తిస్తుంది. ఐతే నటీనటులకు.. సాంకేతిక నిపుణులకు పారితోషకంగా చెల్లించే డబ్బులు ఇందులో కలవవు. కేవలం సినిమాపై ఖర్చు పెట్టే మొత్తం రూ.4 కోట్లు దాటకుంటే చాలు.
ఐతే ఏడాదిలో గరిష్టంగా 15 సినిమాలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ రూల్ ప్రకారం ఈ రాయితీ లభిస్తుంది. సినిమా చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ సైతం ఏపీలోనే జరపాలని.. అలాగే నిర్మాణ సంస్థకు ఏపీలో ఆఫీస్ ఉండాలని.. ఫీజు కట్టి APSFTVTDCలో తమ సంస్థను రిజిస్టర్ చేయించుకోవాలని కూడా ప్రభుత్వం షరతులు విధించింది. సమాజాన్ని తప్పుదోవ పట్టించని మంచి సినిమా అయ్యుండాలని కూడా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమిది.మరి ఈ షరతులకన్నింటికీ లోబడి ఏపీలో ఎన్ని సినిమాలు తెరకెక్కుతాయో.. ఎంత ప్రయోజనం పొందుతాయో చూడాలి.