Begin typing your search above and press return to search.
ఆన్ లైన్ టికెట్ల విధానం పై ఏపీ హైకోర్టు ఏం చెప్పింది?
By: Tupaki Desk | 20 Jan 2022 3:57 AM GMTఆన్ లైన్ పద్దతిలో సినిమా టికెట్లను అమ్మాలని ఏపీ ప్రభుత్వం భావించటం.. దీనిపై అనుకూలంగా కొందరు.. వ్యతిరేకంగా మరికొందరు వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల అమ్మకాల మొత్తాన్ని ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆన్ లైన్ లో అమ్మే విషయంపై వెల్లువెత్తుతున్న అభ్యంతరాల నేపథ్యంలో కొందరు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన పిటిషన్ల విచారణ తాజాగా జరిగింది. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆన్ లైన్ లో సినిమా టికెట్లను అమ్మేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం జీవో నెంబరు 142ను జారీ చేసింది. దీనిపై మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జరిగిన విచారణలో ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని చూస్తే..
- ఆన్‌లైన్‌లో విక్రయానికి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో తప్పేముంది?
- ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో టిక్కెట్లను విక్రయిస్తే పన్నుల ఎగవేతను అడ్డుకోవచ్చు.
- దీనివల్ల ఎవరి ప్రాథమిక హక్కులకూ భంగం వాటిల్లే అవకాశం లేదు కదా?
- ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మితే తప్పేముంది?
- ఆన్‌లైన్ గురించి తెలియకపోవడం ఏంటి?
- ఇప్పుడు ప్రపంచమంతా ఆన్‌లైన్ ద్వారానే పనిచేస్తోంది.
- ఆన్‌లైన్‌లో సినిమాలు ఎలా చూడాలో జనాలకు బాగా తెలుసు. మీరు కూడా ఆన్ లైన్ ద్వారానే వాదనలు వినిపిస్తున్నారు.
- ఆన్ లైన్ గురించి ప్రజలకు తెలియదనుకోవటం పొరపాటు
పిటిషనర్ తరఫున న్యాయవాది లేవనెత్తిన అంశాలివే..
- ఆన్‌లైన్ టికెట్ల విధానాన్ని సవాలు చేస్తూ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశాం.
- ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మితే గుత్తాధిపత్యం అవుతుంది.
- ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల థియేటర్ల యాజమాన్యాల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోంది.
- ఆన్‌లైన్‌లో టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పటికీ చాలా మందికి తెలియదు.
ఈ కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని పేర్కొన్న ఏపీ హైకోర్టు.. తన తదుపరి విచారణను ఫిబ్రవరి 16కు వాయిదా వేసింది. అంతేకాదు ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్లను దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు.