Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ ను చూస్తామన్న ఏపీ హైకోర్టు.. ‘స్టార్ మా’కు, నాగార్జునకు నోటీసులు

By:  Tupaki Desk   |   28 Oct 2022 4:38 PM GMT
బిగ్ బాస్ ను చూస్తామన్న ఏపీ హైకోర్టు.. ‘స్టార్ మా’కు, నాగార్జునకు నోటీసులు
X
బుల్లితెరపై నంబర్ 1 రియాలిటీ షో బిగ్ బాస్. ఇది జనాల్లో ఎంత పాపులర్ నో.. అంతే స్థాయిలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. దీన్ని నిషేధించాలని సంప్రదాయవాదులు కోరుతూనే ఉన్నారు. సీపీఐ నారాయణ లాంటి వారైతే ‘బిగ్ బాస్’ను బ్రోతల్ హౌస్ అని తీవ్రవిమర్శలు చేశారు. బిగ్ బాస్ నిషేధించాలంటూ కొందరు హైకోర్టుకు కూడా ఎక్కారు. తాజాగా బిగ్ బాస్ ను విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మరోసారి వార్తల్లో నిలిచింది. తెలుగు సినీ నిర్మాత, తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై కౌంటర్ దాఖలు చేయాలని బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున, షో నిర్వాహకులు, కేంద్ర ప్రభుత్వం, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది.

గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ బిగ్ బాస్ షో  కొన్ని ఎపిసోడ్లను చూస్తామని తెలిపింది. బిగ్ బాస్ రియాల్టీ షో కార్యక్రమంపై తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులులతో కూడిన డివిజన్ బెంచ్ షోలోని కొన్ని ఎపిసోడ్‌లను చూస్తామని తాజాగా తెలిపింది.

టెలివిజన్ రియాలిటీ షో 'బిగ్ బాస్ 6' (తెలుగు సీజన్) షోలో అశ్లీలత , అసభ్యతను ప్రోత్సహిస్తుందనే కారణంతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయబడింది.

పిటిషనర్ తాను ఫిల్మ్ ప్రొడ్యూసర్ అని పేర్కొంటూ ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ ('IBF'), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ('CBFC'), స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Maa TV) ,  ఎండెమోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లను ప్రతివాదులుగా చేర్చి పిటీషన్ దాఖలు చేశారు.

దీంతో హైకోర్టు కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణకు నోటీసులు ఇవ్వాలని కోరారు. 'బిగ్ బాస్' తెలుగు వెర్షన్ ప్రసారాన్ని ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా  ఆపేయాలని కోర్టును కోరారు. దీంతో కోర్టు షోను చూశాక తాము నిర్ణయిస్తామని సంచలన ప్రకటన చేసింది. అశ్లీలత ఉంటే హైకోర్టు ఈ షోను నిలిపివేసే అవకాశాలు ఉంటాయి. అదే జరిగితే బిగ్ బాస్ ప్రేమికులు ఎంటర్ టైన్ మెంట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.