Begin typing your search above and press return to search.
ఆన్ లైన్ టికెటింగ్ పై ఏపీ మంత్రితో భేటీ?
By: Tupaki Desk | 20 Sep 2021 7:33 AM GMTఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై ప్రభుత్వ జీవో కలకలం రేపిన సంగతి తెలిసిందే. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సవరించిన రేట్లతో వెలువరించిన జీవో వల్ల సినీపరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు పంపిణీ వర్గాలు సహా నిర్మాతల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. టిక్కెట్టు ధరలు అవాంఛనీయంగా మార్చారని సినీప్రముఖులు ఇప్పటికే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. టిక్కెట్టు ధరల వ్యవహారంపై పరిశ్రమ వర్గాలు నిరంతరం మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రభుత్వంతో మంతనాలు సాగించి దీనికి పరిష్కారం కనుగొనాలని ప్రయత్నిస్తున్నా అది సాధ్యపడడం లేదు.
ఆదివారం సాయంత్రం జరిగిన `లవ్ స్టోరి` ప్రచార వేదికపై సినీపెద్దగా మెగాస్టార్ చిరంజీవి టిక్కెట్టు ధరలు ఇతర సమస్యలపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వానికి పరోక్షంగా సూచనలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆన్ లైన్ పోర్టల్ పేరుతో టిక్కెట్టు రేట్లను ఇక ఏపీ ప్రభుత్వం నియంత్రించే విషయంపైనా తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి.
అయితే ఆన్ లైన్ పోర్టల్ ద్వారా టిక్కెట్ల అమ్మకాలపై అభ్యంతరాలను పరిశీలించేందుకు ఏపీ మంతి పేర్ని నాని సినీపెద్దలతో భేటీలో పాల్గొంటున్నారని తెలిసింది. ఆయన నిర్మాతలు.. పంపిణీదారులు ఎగ్జిబిటర్లతో సమావేశంలో అన్ని విషయాల్ని చర్చించేందుకు ప్రయత్నిస్తున్నారు. నేడు ఈ భేటీ జరగనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అభిప్రాయాలు తెలుసుకుని సలహాలు సూచనలు స్వీకరించే దిశగా మంత్రివర్యులు ప్రయత్నిస్తున్నారు. ఇక పోర్టల్ పని చేసే విధానంపైనా పరిశ్రమ పెద్దలకు వివరించనున్నారని తెలిసింది.
సీఎంతో భేటీకి ముందే మంత్రి నానితో!
టాలీవుడ్ పెద్దలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు భేటీ అవుతారని ఇటీవల కథనాలొస్తున్న నేపథ్యంలో మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటి జరుగుతుందని మంత్రి నాని తెలిపినట్టు కథనాలొచ్చాయి. కానీ ఈ మీటింగ్ లో సీఎం ఉండరని తేలిపోయింది. కేవలం మంత్రితోనే చర్చలు సాగనున్నాయని తెలుస్తోంది.
ఈ భేటీలో ఏం చర్చిస్తారు? అంటే.. టిక్కెట్టు ధరలతో పాటు ఇతర అంశాల్ని ప్రస్థావించనున్నారు. థియేటర్ వ్యవస్థపై కూడా కూలంకుశంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. భేటీకి టాలీవుడ్ నుంచి పెద్దలు ఎవరెవరు హజరవు తారు? అన్నదానిపై సరైన స్పష్టత లేదు. నేరుగా సీఎంతో సమావేశం అంటే కచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి..నాగార్జున.. సురేష్ బాబు లాంటి పెద్దలు తప్పక హాజరు అయ్యేవారు. అలాగే మంత్రితో భేటీ అంటే విజయవాడలోనా హైదరాబాద్ లోనా? అన్నది క్లారిటీ రాలేదు.
గతంలో జగన్ తో ఇలాంటి సమావేశం నిర్వహించినప్పుడు చిరంజీవి సహా కీలక మైన వ్యక్తులంతా హాజరయ్యారు. ఆ సమావేశంలోనే సినీపరిశ్రమ సమస్యలతో పాటు నంది అవార్డుల నిర్వహణ అలానే విశాఖలో ఫిలిం సిటీ డెవలెప్ మెంట్ పై సుదీర్ఘంగా చర్చించిన సంగతి తెలిసినదే.. స్థలాల కేటాయింపుకు సంబంధించిన వివరాలు కూడా సేకరించాలని సీఎం అదేశాలిచ్చారు.
ఏం చర్చిస్తారు అంటే..?
ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్టు రేట్ల సమస్య ప్రధానమైనది.. దీనివల్లనే చాలా పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. ఇటీవల టికెట్ ధరలపై ఏపీలో వచ్చిన సవరణ జీవోతో చిక్కులపై భేటీలో చర్చించనున్నారని తెలిసింది. గ్రామ పంచాయితీ- నగర పంచాయితీ- కార్పొరేషన్ ఏరియాల్లో టిక్కెట్టు ధరలపై నా చర్చిస్తారు. ఇతర చిన్న నిర్మాతల డిమాండ్ మేరకు ఐదో షోని చిన్న సినిమాకి కేటాయించాల్సిందిగా కోరనున్నారు. అలాగే మునుపటిలాగే ప్రతియేటా నంది అవార్డులతో కళాకారులను ప్రోత్సహించాలని కోరతారు. వినోదపు పన్ను మినహాయింపులు... కరోనా క్రైసిస్ కష్టకాలంలో థియేటర్లకు పన్ను రద్దు వగైరా అంశాల్ని చర్చిస్తారు. ఆ సమయంలో కరెంటు బిల్లుల మాఫీ అంశం ప్రస్థావనకు తెస్తారట. ఎగ్జిబిషన్ రంగాన్ని కాపాడటానికి తక్షణ సాయం కోరతారని తెలిసింది. విడుదలైన మొదటి వారంలో సినిమాల కోసం అదనపు బెనిఫిట్ షోలను నడపడం వంటి అంశాల్ని టాలీవుడ్ ప్రతినిధి బృందం మంత్రి దృష్టికి తీసుకెళుతుంది.