Begin typing your search above and press return to search.
ఎగ్జిబిటర్స్ తో ఏపీ మంత్రి భేటీ..!
By: Tupaki Desk | 10 Nov 2021 2:33 PM GMTఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని బుధవారం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్స్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పశ్చిమ గోదావరి - కృష్ణా - గుంటూరు జిల్లాల థియేటర్ల యజమానులు కూడా హాజరయ్యారు. ఆన్ లైన్ సినిమా టికెటింగ్ విధానం - టికెట్ రేట్లు - సినిమా థియేటర్ల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఈ భేటీలో చర్చించారు.
ఏపీ సినిమాటోగ్రఫీ చట్టంలో కొన్ని సవరణలకు ఇటీవల ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో మంత్రితో ఎగ్జిబిటర్స్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం కోసం రూపొందించే వెబ్ సైట్ విషయంలో సినిమా ఎగ్జిబిటర్స్ అభిప్రాయాలు తీసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుత సినిమా టికెట్ బుకింగ్ విధానం నుంచి ఏపీ ప్రభుత్వం తీసుకురాబోయే ఆన్ లైన్ పోర్టల్ కి మారే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కృష్ణా - గుంటూరు - పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన థియేటర్ ఓనర్లతో సమావేశమైనట్లే.. విశాఖ - తిరుపతి నగరాల్లో భేటీ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుందని తెలుస్తోంది.
కాగా, గత నెలలో పలువురు సినీ ప్రముఖులతో మంత్రి పేర్ని నాని సమావేశమైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ కి సంబంధించిన వివిధ సమస్యలు - సినిమాటోగ్రఫీ చట్టం సవరణ.. ఆన్ లైన్ టిక్కెటింగ్ సిస్టమ్ మీద ఈ మీటింగ్ లో చర్చించారు.