Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ సినిమా పూర్త‌య్యాక అప‌రిచితుడు రీమేక్?

By:  Tupaki Desk   |   10 April 2021 6:15 AM GMT
చ‌ర‌ణ్ సినిమా పూర్త‌య్యాక అప‌రిచితుడు రీమేక్?
X
సౌత్ బ్లాక్ బ‌స్ట‌ర్లు హిందీలో రీమేకై సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌ల్మాన్ ఖాన్.. అక్ష‌య్ కుమార్... షాహిద్ క‌పూర్ స‌హా ర‌ణ‌వీర్ సింగ్ లాంటి ఎన‌ర్జిటిక్ హీరోలు సౌత్ రీమేక్ ల‌తో స‌క్సెస్ లు అందుకున్నారు. ర‌ణ‌వీర్ ఇంత‌కుముందు తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ టెంప‌ర్ ని హిందీలో సింబాగా రీమేక్ చేసి బంప‌ర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు మ‌రో సౌత్ రీమేక్ పైనా మ‌న‌సు పా‌రేసుకున్నాడ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

ఈసారి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అప‌రిచితుడు (అన్నియ‌న్) ని హిందీలో రీమేక్ చేయాల‌నేది ప్లాన్. దీనిపై ర‌ణ‌వీర్ ఇప్ప‌టికే శంక‌ర్ తో చ‌ర్చిస్తున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన అపరిచిత్తుడు (అన్నియ‌న్) తెలుగు త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన‌ సంగ‌తి తెలిసిందే. ఇది విక్రమ్ కెరీర్ కి బిగ్ బూస్ట్ ఇచ్చిన చిత్రం. డ్యూయ‌ల్ స్ప్లిట్ ప‌ర్స‌నాలిటీ అనే అరుదైన‌ రుగ్మ‌త‌తో బాధపడే యువ‌కుడిగా చియాన్ అద‌ర‌గొట్టేయ‌డంతో తెలుగులోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. ఈ సినిమా రిలీజ‌య్యాక చియాన్ రెమో రాము పాత్ర‌ల‌కు పేరడీలు స్పూఫ్ ‌లు మోతెక్కిపోయాయి. ఇప్ప‌టికీ ఆ పాత్ర‌ల‌కు పేర‌డీలు చేసేవాళ్లున్నారు.

ప్ర‌స్తుతం దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ తో శంకర్ తన తదుపరి ప్రాజెక్టును ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఆర్.‌ఆర్.‌ఆర్ పూర్త‌య్యాక చ‌ర‌ణ్ వెంటనే ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అవుతార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఈలోగానే శంక‌ర్ అప‌రిచితుడు హిందీ రీమేక్ పై దృష్టి సారించారంటూ ప్ర‌చారం వేడెక్కిస్తోంది. రామ్ చరణ్ తో శంకర్ తన సినిమా పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే వీలుంది. అంటే తాపీగా వ‌చ్చే ఏడాది నాటికి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అపరిచిత్తుడు 2005 లో విడుదలైంది. దీనిని హిందీ ఛానెళ్లలో కూడా డబ్ చేసి ప్రసారం చేశారు. అయినా ఇన్నాళ్ల త‌ర్వాత దీనిని రీమేక్ చేయాల‌ని అనుకోవ‌డం.. దానిపై ర‌ణ‌వీర్ సింగ్ మ‌న‌సు పారేసుకోవ‌డం ఆస‌క్తిని పెంచుతోంది. ఒక‌వేళ అప‌రిచితుడు క‌థాంశాన్ని మార్చాల్సి వ‌స్తే నేటి స‌మాజానికి క‌రెంట్ టాపిక్స్ కి అనువ‌ర్తించాల్సి ఉంటుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు. స‌మాజం పోక‌డ‌లో రాజ‌కీయాల్లో చాలా విష‌యాల్లో నేడు మార్పులు స్ప‌ష్ఠంగా క‌నిపిస్తున్నాయి. అందుకు త‌గ్గ‌ట్టే శంక‌ర్ క‌థ‌ను మార్చాల్సి రావొచ్చు. అలాగే హిందీ వెర్ష‌న్ కి ఎవ‌రు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు? అన్న‌దానిపైనా శంక‌ర్ వ‌ర్గాల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ర‌ణ‌వీర్ న‌టించిన 83 త్వ‌ర‌లో రిలీజ్ కి రావాల్సి ఉండ‌గా క‌రోనా వైరస్ సెకండ్ వేవ్ వ‌ల్ల వాయిదా వేస్తున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.