Begin typing your search above and press return to search.

అపరిచితుడు రీమేక్ హీరోయిన్ ఖరారు.. డైరెక్టర్ అసలు ఆగట్లేదుగా!

By:  Tupaki Desk   |   17 April 2021 7:39 AM GMT
అపరిచితుడు రీమేక్ హీరోయిన్ ఖరారు.. డైరెక్టర్ అసలు ఆగట్లేదుగా!
X
ఇండస్ట్రీలో ఓవైపు తన సినిమా గురించి వివాదం నడుస్తుండగానే మరోవైపు నటినటుల ఎంపిక కొనసాగిస్తున్నాడు స్టార్ డైరెక్టర్ శంకర్. ఇటీవలే పదహారేళ్ల క్రితం తెరకెక్కించిన అపరిచితుడు హిందీ రీమేక్ ప్రకటించిన శంకర్.. ఆ మరుసటి రోజే నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ తో వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పటికే సినిమా కథ విషయంలో లీగల్ నోటిస్ అందుకున్న శంకర్.. అయినా సరే అనుకుంటూ అపరిచితుడు రీమేక్ పనులు కంటిన్యూ చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కనున్న ఈ అపరిచితుడు రీమేక్ లో తాజాగా హీరోయిన్ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. బాలీవుడ్ యంగ్ బ్యూటీ కియారా అద్వానీ.. ఈ రీమేక్ సినిమాలో రన్వీర్ తో జోడి కట్టనుంది.

ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ హీరోయిన్ కియారా సంతకం చేసిందని టాక్. ఇదిలా ఉండగా.. ఓవైపు వివాదం ఇంకా ముగియనే లేదు. డైరెక్టర్ శంకర్ మాత్రం ఏమి సంబంధం లేదన్నట్లుగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అంటే సినిమా సినిమానే.. వివాదం వివాదమే అన్నట్లుగా శంకర్ తీరు కనిపిస్తుందని సినీవర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. ఆస్కార్ రవిచంద్రన్ అపరిచితుడు రీమేక్ విషయంలో ఎలాగైనా నెగ్గాలనే ఉద్దేశంతో కోర్టు వైపు అడుగువేసే సూచనలు కనిపిస్తుండగా.. శంకర్ మాత్రం సినిమాకు కథ, కథనం దర్శకత్వం నాదే కాబట్టి రీమేక్ హక్కులు నాకున్నాయని వాదిస్తున్నాడు. మరి ఈ లెక్కన ఎవరికీ వారే సవాల్ అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తుంది.