Begin typing your search above and press return to search.

ఆ బ్యూటీ కి స్టార్ హీరో తో నటించే లక్కీ ఛాన్స్!

By:  Tupaki Desk   |   9 April 2019 9:31 AM GMT
ఆ బ్యూటీ కి స్టార్ హీరో తో నటించే లక్కీ ఛాన్స్!
X
తమిళంలోనే కాకుండా సౌత్ అంతా ఫాలోయంగ్ ఉన్న హీరో సూర్య. ఈమధ్య సూర్య నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. అయినా సూర్య ఫాలోయింగ్ కు వచ్చిన ఇబ్బంది ఏమీలేదు. సూర్య కొత్త సినిమా 'N.G.K' త్వరలోనే రిలీజ్ కానుంది. సూర్య కేవీ ఆనంద్ దర్శకత్వంలో 'కాప్పాన్' అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నటించబోయే కొత్త సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది.

'గురు' ఫేమ్ సుధ కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎయిర్ డెక్కన్ సంస్థకు ఫౌండర్ అయిన జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందట. ఈ సినిమాలో హీరోయిన్ గా పెద్దగా గుర్తింపు లేని అపర్ణ బాలమురళిని ఎంచుకున్నారట. కేరళ బ్యూటీ అయిన అపర్ణ ఇప్పటికే దాదాపు పదికి పైగా మలయాళం చిత్రాలలో నటించింది. తమిళంలో కూడా ఇప్పటికే రెండు సినిమాలు చేసి నటన విషయంలో తనను తాను ఋజువు చేసుకుంది. ఈ అమ్మాయినే హీరోయిన్ గా ఎంపిక చేసుకోవడానికి కారణం జీఆర్ గోపీనాథ్ భార్య పోలికలు అపర్ణకు ఎక్కువగా ఉండడమేనట. దాంతో పాట అపర్ణ నటన కూడా ప్లస్ కావడంతో అపర్ణకు సూర్య సినిమాలో హీరోయిన్ ఆఫర్ దక్కింది.

జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య స్వయంగా నిర్మిస్తున్నాడు. దర్శకురాలు సుధ కొంగర మొదటి సినిమా అన్ని భాషల ఆడియన్స్ ను మెప్పించింది. మరి ఈ సినిమాతో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందేమో వేచి చూడాలి.