Begin typing your search above and press return to search.

రింగులోకి దిగిన‌ సూర్య హీరోయిన్

By:  Tupaki Desk   |   13 March 2022 12:30 AM GMT
రింగులోకి దిగిన‌ సూర్య హీరోయిన్
X
ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డానికి స్టార్స్ ఈ మ‌ధ్య చాలా క‌ష్ట‌ప‌డుతున్నారు. ఎలాంటి రిస్క్ లు చేయ‌డానికైనా సిద్ధ‌ప‌డుతున్నారు. క్రికెట్ స్టోరీలో క్రికెట‌ర్‌గా, బాక్సింగ్ డ్రామాలో బాక్స‌ర్ గా.. ఇలా ఏ పాత్ర చేసినా అందులో స‌హ‌జంగా క‌నిపించ‌డం కోసం శ్ర‌మిస్తున్నారు.

క్రికెట‌ర్ స్టోరీ అయితే క్రికెట్ నేర్చుకుంటున్నారు. బాక్స‌ర్ స్టోరీ అయితే బాక్సింగ్ లో మెళ‌కువ‌లు నేర్చుకుని సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్ లు కూడా అందులో మేము ఏ మాత్రం త‌క్కువ కాద‌ని నిరూపిస్తున్నారు.

`డియ‌ర్‌ కామ్రేడ్` చిత్రంలో క్రికెట‌ర్ గా లిల్లీ పాత్ర‌లో న‌టించిన ర‌ష్మిక ఆ పాత్ర కోసం క్రికెట్ నేర్చుకుని మ‌రీ న‌టించింది. ఇదే త‌ర‌హాలో సూర్య హీరోయిన్ బాక్సింగ్ నేప‌థ్యంలో రూపొందుతున్న మూవీలో బాక్స‌ర్ గా న‌టిస్తోంది.

ఇందు కోసం బాక్సింగ్ రింగ్ లోకి దిగి బాక్సింగ్ నేర్చుకుంటుండ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. స్టార్ హీరో సూర్య న‌టించిన `ఆకాశ‌మే నీ హ‌ద్దురా` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించి తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది మ‌ల‌యాళ కుట్టి అప‌ర్ణ బాల‌ముర‌ళి.

సూర్య - అప‌ర్ణ బాల‌ముర‌ళి మ‌ధ్య కెమిస్ట్రీ చ‌క్క‌గా కుద‌ర‌డంతో అది సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా నిలిచి సినిమా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది. ప్ర‌స్తుతం అపర్ణ బాల‌ముర‌ళి త‌న కొత్త చిత్రానికి రెడీ అవుతోంది. ఏకంగా కొత్త చిత్రం కోసం అప‌ర్ణ బాక్సింగ్ ట్రైన‌ర్ తో క‌లిసి బాక్సింగ్ రింగ్ లోకి దిగ‌డం ఇప్ప‌డు ఆస‌క్తికంగా మారింది. బాక్సింగ్ ట్రైన‌ర్ స‌హాయంతో త‌న త‌దుప‌రి సినిమా కోసం ఆమె బాక్సింగ్ నేర్చుకుంటోంది.

ఇందుకు సంబంధించిన వీడియోని అప‌ర్ణ బాల‌ముర‌ళి సోష‌ల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయ‌డంతో ఇప్ప‌డ‌ది నెట్టింట వైర‌ల్ గా మారింది. తాజా వీడియోపై నెటిజ‌న్ ల‌తో పాటు సెల‌బ్రిటీలు కూడా కామెంట్ లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం అప‌ర్ణ బాల‌ముర‌ళి దాదాపు ఏడు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వుంది అందులో ఓ చిత్రం `ఆకాశం` పేరుతో తెలుగులోనూ త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది.