Begin typing your search above and press return to search.

తెర‌పై మిల్కీబ్యూటీ మెరుపులు ఇక క‌ష్ట‌మే!

By:  Tupaki Desk   |   31 Dec 2022 2:30 PM GMT
తెర‌పై మిల్కీబ్యూటీ  మెరుపులు ఇక క‌ష్ట‌మే!
X
టాలీవుడ్ కి ఉవ్వెత్తున దూసుకొచ్చి యూత్ లో క్రేజీగా వెలిగిపోయిన మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించేసింది. యువ హీరోల‌తో కెరీర్ ప్రారంభించి సీనియ‌ర్ హీరోల‌తో సైతం రొమాన్స్ చేసిన అరుదైన భామ‌. చిరంజీవి..వెంక‌టేష్ లాంటి హీరోల‌తోనూ ప‌నిచేసి త‌నదైన‌ మార్క్ వేసింది.

ఐటం పాట‌ల్లో సైతం మెప్పించింది. దాదాపు 13 ఏళ్ల‌గా సేవ‌లందించి ప్రేక్ష‌కుల్ని ఉర్రూత‌లూగించింది. ఓ న‌టి ఇన్నేళ్లు కెరీర్ కొన‌సాగించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఆర‌కంగా త‌మ‌న్నా తెలుగు సినిమాల‌పై త‌న‌దైన ముద్ర వేసింది. అంతేనా త‌మిళ‌..హిందీ చిత్రాల్లోనూ న‌టించింది. అయితే ఇప్పుడీ బ్యూటీ వేగం మునుప‌టిలా లేదు అన్న‌ది వాస్త‌వం.

నాలుగైదేళ్ల‌గా అమ్మ‌డికి సరైన అవ‌కాశాలైతే రావ‌డం లేదు. హీరోయిన్ గా ఛాన్సులు త‌గ్గ‌డంతో స‌హాయ పాత్ర‌లు..గెస్ట్ పాత్ర‌ల్లో సైతం స్టార్స్ చిత్రాల్లో క‌నిపిస్తుంది. ఇప్పుడు ఆ ర‌క‌మైన అవ‌కాశాలు త‌గ్గిన‌ట్లు క‌నిపిస్తుంది. ఇటీవ‌లే 'గుర్తుందా శీతాకాలం' అనే సినిమాలో న‌టించింది. ఇందులో స‌త్య‌దేవ్ హీరో....స్టార్ హీరోతో రొమాన్స్ చేసిన భామ స‌త్య‌దేవ్ లాంటి స‌హాయ న‌టుడి స‌ర‌స‌న న‌టించ‌డంతోనే మిల్కీ ఎంత‌గా నెమ్మ‌దించిద‌న్న‌ది అద్దం ప‌డుతుంది.

న‌టిగా వృత్తికి న్యాయం చేసినా స్టార్ లీగ్ నుంచి త‌ప్పుకుంద‌నే భావ‌న అభిమానుల్లో క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం తెలుగులో 'భోళా శంక‌ర్' లో న‌టిస్తుంది. ఇందులో అమ్మ‌డు చిరంజీవి జోడీగా క‌నిపించ‌నుంది. సీనియ‌ర్ హీరో చిరు కి హీరోయిన్ల స‌మస్య‌ ఉండ‌నే ఉంది. ఆ కోవ‌లో సైరా న‌ర‌సింహారెడ్డిలో చిరు తో కొన్ని స‌న్నివేశాల‌కు త‌మ‌న్నా న్యాయం చేయ‌డంతోనే భోళా శంక‌ర్ లో ఛాన్స్ ద‌క్కించుకోగ‌ల్గింది.

ఈ సినిమా త‌ప్ప తెలుగులో మ‌రో కొత్త ప్రాజెక్ట్ చేతిలో లేదు. ఈసినిమా హిట్ అయిన మ‌ళ్లీ బిజీ అవుతుంద‌న్న న‌మ్మ‌కం క‌నిపించ‌లేదు. న‌వ నాయిక‌ల మ‌ధ్య పోటీని త‌ట్టుకుని త‌మన్నా నిలబ‌డ‌టం క‌ష్ట‌మ‌నేది విశ్లేష‌కుల అంచ‌నా. ఇది ముందే గెస్ చేసిందో ఏమో! అమ్మ‌డు తాజాగా మాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తుంది. అక్క‌డ 'బాంద్ర' అనే ఓ సినిమాలో న‌టిస్తోంది. మ‌రి ఈ బ్యూటీ గ‌నుక స‌క్సెస్ అయితే కంటున్యూస్ గా సినిమాలు చేసే అవ‌కాశం ఉంది. అలాగే కుటుంబ స‌భ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్న‌ట్లు ఆ మ‌ధ్య వార్త‌లొచ్చాయి. న‌చ్చిన వాడు దొరికితే చేసుకోవ‌డానికి తాను సిద్దంగానే ఉన్నాన‌ని తెలిపింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.