Begin typing your search above and press return to search.
ఇండస్ట్రీలో పరిస్థితి దారుణంగా ఉంది:అపూర్వ!
By: Tupaki Desk | 11 April 2018 1:44 PM GMTశ్రీరెడ్డి ఉదంతం టాలీవుడ్ లో పెను ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి చేస్తోన్న ఆరోపణలు వాస్తవమేనని, తనతో చాలామంది అమ్మాయిలు ఆ బాధను చెప్పుకున్నారని నటి అపూర్వ ఓ చానెల్ లైవ్ డిబేట్ లో చెప్పిన విషయం విదితమే. తాజాగా, టాలీవుడ్ పై అపూర్వ షాకింగ్ కామెంట్స్ చేసింది. అర్ధనగ్న ప్రదర్శన చేసిందన్న కారణాలతో శ్రీరెడ్డిని `మా `బాయ్ కాట్ చేసిందని, `మా`లోని 900 మంది సభ్యులు ఆమెతో కలిసి నటించకూడదని నిషేధం విధించడం సరికాదని అపూర్వ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను కూడా `మా`లో సభ్యురాలినని, కానీ, ఆమెను బాయ్ కాట్ చేస్తున్నట్లు తనకు సమాచారం కూడా ఇవ్వకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని చెప్పింది. ఆ నిర్ణయం నచ్చకే తాను `మా`నుంచి బయటకు వచ్చానని తెలిపింది. శ్రీరెడ్డి తరహాలో వందలాది మంది అమ్మాయిలు లైంగిక వేధింపులకు - కాస్టింగ్ కౌచ్ కు బలవుతున్నారని, వారంతా తమ గోడును తనతో వెళ్లగక్కారని వాపోయింది. తన 18 ఏళ్ల కెరీర్ లో కాస్టింగ్ కౌచ్ బారిన తాను పడలేదని, డిన్నర్ కెల్దామా...అని కొంతమంది అడిగిన సందర్భాలు మాత్రం ఉన్నాయని ఆమె చెప్పింది.
తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని, తమకు సాయం చేయమని చిన్న పిల్లలు - అమ్మాయిలు - జూనియర్ ఆర్టిస్టులు తనకు చెప్పారని అపూర్వ తెలిపింది. తమకు వచ్చే 4000 రూపాయల రెమ్యున్ రేషన్ లో బ్రోకర్లు 3000 తీసుకొని 1000 రూపాయలను చేతిలో పెడుతున్నారని వారు వాపోయారని చెప్పింది. ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలు బ్రతకడం చాలా కష్టమైందని తెలిపింది. శ్రీరెడ్డికి చాలా మంది మద్దతు తెలుపుతున్నారని - మహిళా సంఘాలు - యువజన సంఘాలు బాసటగా నిలిచాయని చెప్పింది. ఇండస్ట్రీలో అంతా సవ్యంగా ఉంటే శ్రీరెడ్డి రోడ్డుపైకి వచ్చి బట్టలు విప్పుకునే పరిస్థితి వచ్చేది కాదని చెప్పింది. టాలీవుడ్ లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, రోజుకు వందలాది మంది అమ్మాయిలు తనకు ఫోన్ చేసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఓ పక్క బిడ్డల పాలిస్తున్నా పట్టించుకోకుండా....తన లైంగిక వాంఛ తీర్చమని అడిగే నికృష్టులున్నారని ఓ అమ్మాయి తనతో చెప్పిందని అపూర్వ కన్నీటి పర్యంతమైంది. నిర్భయ వంటి కఠిన చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో, సమాజంలో ఇటువంటి అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయని, వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. సినిమా ఇండస్ట్రీనే కాకుండా, ఏ రంగానికి చెందిన మహిళైనా...లైంగిక వేధింపులకు, కాస్టింగ్ కౌచ్ కు గురైతే.... తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు ఒక హెల్ప్ లైన్ పెట్టాలని కోరింది. ఈవ్ టీజింగ్ ను అరికట్టేందుకు ఏర్పడ్డ `షీ టీమ్` తరహాలోనే శ్రీరెడ్డి తరహాలో బలైన మహిళల కోసం ఒక వెబ్ సైట్ - హెల్స్ లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని కోరింది. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మీడియాకు అపూర్వ విజ్ఞప్తి చేసింది.