Begin typing your search above and press return to search.
టెంపర్ గాళ్ పైలెట్ అయ్యిందే
By: Tupaki Desk | 4 Sep 2020 5:33 PM GMTజూనియర్ ఎన్టీఆర్ `టెంపర్` లో దారుణంగా అత్యాచారానికి గురైన అమ్మాయిగా నటించింది హైదరాబాద్ మోడల్ అపూర్వా శ్రీనివాసన్. ఆమె తమిళమ్మాయే అయినా హైదరాబాద్ తో తనకు ఉన్న అనుబంధం గొప్పది. టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్ వరుసగా అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేశారు. జ్యోతిలక్ష్మి చిత్రంలోనూ తనకో చిన్న పాత్రను ఇచ్చిన పూరి తదుపరి చిత్రాల్లోనూ ఈ అమ్మాయికి అవకాశాలిస్తున్నారట.
తాజాగా ఈ భామ ఊహించని విధంగా సర్ ప్రైజ్ చేసింది. అపూర్వ పైలెట్ శిక్షణను అభ్యసించి లైసెన్స్ కోసం ప్రయత్నిస్తోందట. తను పైలెట్ గా యూనిఫాంలో ఉన్న ఫోటోల్ని సోషల్ మీడియాల్లో షేర్ చేసింది. ఈ తమిళమ్మాయ్ నేడు ఆకాశంలో చక్కర్లు కొట్టిందట. దుండిగల్ ఎయిర్ బేస్ నుండి హైదరాబాద్ స్కైస్ లో షికార్లు చేసొచ్చిందట. VT-FAV మాత్రమే సెస్నా విమానంలో తన మొదటి సోలో రైడ్ చేసి శహభాష్ అనిపించేసిందట.
ఇక కమర్షియల్ పైలట్ గా ఎదగాలంటే ఏదైనా ప్రముఖ ఎయిర్ క్యారియర్ లో చేరవచ్చు. కానీ దీనికి ముందు పైలెట్ లైసెన్స్ పొందే అర్హత సాధించడానికి ఆమె చాలా లైసెన్స్ లను పొందాలి. పైగా పర్ఫెక్ట్ ఫిట్ గా ఉండాలి పైలెట్ అంటే. అపూర్వ నే పైలెట్ అయిన తొలి లేడీ యాక్ట్రెస్ అవుతుందేమో చూడాలి. సినిమాలే లోకం కాదు.. తనలో ఇలాంటి అద్భుతమైన నైపుణ్యం కూడా ఉందని ఈ తమిళమ్మాయి నిరూపిస్తోంది. అపూర్వ మరో గుంజన్ సక్సేనా అవుతుందా? అంటే ఇది వైమానిక దళం కాదు. కేవలం కమర్షియల్ పైలెట్ అంతే.