Begin typing your search above and press return to search.

అప్ప‌ట్లో ఒక‌డు.. వాళ్ల‌కు కావాల‌ట‌

By:  Tupaki Desk   |   24 March 2017 5:06 PM GMT
అప్ప‌ట్లో ఒక‌డు.. వాళ్ల‌కు కావాల‌ట‌
X
ఈ మ‌ధ్య కొన్ని తెలుగులో వ‌చ్చిన కొన్ని చిన్న సినిమాలు సైతం పొరుగు భాష‌ల వాళ్ల‌ను బాగా ఆక‌ర్షిస్తున్నాయి. మంచి కంటెంట్ ఉన్న ఆ చిత్రాల్ని త‌మ ప్రేక్ష‌కుల‌కూ ప‌రిచ‌యం చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. రీమేక్ రైట్స్ తీసుకుని త‌మ భాష‌ల్లో పున‌ర్నిర్మిస్తున్నారు. గ‌త ఏడాది క్ష‌ణం.. పెళ్లిచూపులు.. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి చిన్న సినిమాల రీమేక్ రైట్స్ కోసం మంచి డిమాండ్ ఏర్ప‌డింది. ఈ కోవ‌లో ఇప్పుడు ‘అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు’ సినిమా కూడా చేరింది. గ‌త ఏడాది చివ‌ర్లో రిలీజై మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుని.. విమ‌ర్శ‌కుల‌తో పాటు ప్రేక్ష‌కుల్ని కూడా మెప్పించిన ఈ చిత్రం బాలీవుడ్లో రీమేక్ కాబోతుండ‌టం విశేషం.

గ్లోబ‌లైజేష‌న్.. న‌క్స‌లిజం.. క్రికెట్.. మాఫియా.. ఇలా అనేకానేక అంశాల్ని స్పృశిస్తూ 90ల నాటి ప‌రిస్థితుల్ని క‌ళ్ల‌కు క‌డుతూ ఆస‌క్తిక‌రంగా సాగుతుంది ‘అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు’ చిత్రం. ఇవ‌న్నీ యూనివ‌ర్శ‌ల్ కాన్సెప్ట్స్ కావ‌డంతో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయ‌డానికి ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ప్ర‌య‌త్నిస్తోంది. చిత్ర స‌మ‌ర్ప‌కుడు నారా రోహిత్ తో పాటు మిగ‌తా నిర్మాత‌ల‌తో చ‌ర్చలు జ‌రుగుతున్నాయ‌ట ప్ర‌స్తుతం. త్వ‌ర‌లోనే డీల్ ఓకే అయి.. అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశ‌ముంది. మ‌రి బాలీవుడ్లో శ్రీవిష్ణు పోషించిన రైల్వే రాజు పాత్ర‌ను ఎవ‌రు చేస్తారో చూడాలి. రోహిత్ పాత్ర ఎవ‌రికి వెళ్తుంద‌న్న‌దీ ఆస‌క్తిక‌రమే. ‘అయ్యారే’తో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేసిన సాగ‌ర్ చంద్ర ఈ చిత్రాన్ని రూపొందించాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/