Begin typing your search above and press return to search.

అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు.. రిలీజ్ డేట్ ఇదిగో

By:  Tupaki Desk   |   14 Dec 2016 7:30 PM GMT
అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు.. రిలీజ్ డేట్ ఇదిగో
X
2016 ఒక వైవిద్య‌మైన.. ఆస‌క్తిక‌ర‌మైన సినిమాతో ముగియ‌బోతోంది. నారా రోహిత్‌-శ్రీ విష్ణు కాంబినేష‌న్లో సాగ‌ర్ చంద్ర రూపొందించిన ‘అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు’ డిసెంబ‌రు 30న విడుద‌ల కాబోతోంది. విడుద‌ల‌కు చాలా ముందుగానే సెన్సార్ కూడా పూర్తి చేసుకుని ఫ‌స్ట్ కాపీతో రెడీ అయిపోయింది ఈ చిత్రం. సెన్సార్ వాళ్లు ఈ చిత్రానికి యుఎ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. సెన్సార్ అవ్వ‌గానే రిలీజ్ డేట్ ప్ర‌క‌టించేసింది చిత్ర బృందం. ఆల్రెడీ డిసెంబ‌రు 30న అల్ల‌రి న‌రేష్ సినిమా ‘ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం సినిమా విడుద‌ల కానుంది. ఆ సినిమానే 2016కు వీడ్కోలు ప‌లుకుతుంద‌నుకుంటే.. ఇప్పుడు రోహిత్ మూవీ కూడా జాయినైంది.

‘అయ్యారే’ లాంటి ఇంట్రెస్టింగ్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన సాగర్ చంద్ర 90ల నాటి నిజ జీవిత ఘ‌ట‌న‌ల ఆధారంగా ‘అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు’ సినిమాను రూపొందించాడు. దీని టీజ‌ర్.. ట్రైల‌ర్ భ‌లే ఆస‌క్తి రేకెత్తించాయి. ముఖ్యంగా కొన్ని రోజుల కింద‌ట వ‌చ్చిన ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇంటెన్సిటీ ఉన్న‌.. బ‌ల‌మైన కంటెంట్ ఉన్న సినిమాలా క‌నిపిస్తోంది ఈ చిత్రం. ఇందులో రోహిత్.. ముస్లిం పోలీస్ పాత్ర‌లో క‌నిపిస్తుంటే.. శ్రీవిష్ణు క్రికెట‌ర్ ట‌ర్న్డ్ క్రిమిన‌ల్ క్యారెక్ట‌ర్ చేశాడు. వీళ్లిద్ద‌రి మ‌ధ్య పోరాటం నేప‌థ్యంలో క‌థ సాగుతుంది. ఈ సినిమాను ‘అసుర’ దర్శకుడు కృష్ణవిజయ్ తో కలిసి ప్రశాంతి నిర్మిస్తోంది. నారా రోహిత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/