Begin typing your search above and press return to search.

మెరుపు లాంటి ట్రైలర్: అప్పట్లో ఒకడుండేవాడు

By:  Tupaki Desk   |   5 Dec 2016 10:11 AM GMT
మెరుపు లాంటి ట్రైలర్: అప్పట్లో ఒకడుండేవాడు
X
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన.. ఇంటెన్సిటీ ఉన్న సినిమాలు చేస్తూ సాగిపోతున్న నారా రోహిత్ ఈసారి మరో డిఫరెట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నట్లే ఉన్నాడు. రోహిత్.. శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాల్ని మరింత పెంచేలా ఉంది. ట్రైలర్లో ఎంతో ఇంటెన్సిటీ కనిపిస్తోంది.

90ల నాటి నేపథ్యంలో సాగే ఈ కథ ఇది. తాను కూకట్ పల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నానని.. కానీ డబ్బు కొంచెం తక్కువుందని ఓ వ్యక్తి సెటిల్మెంట్లు చేసే శ్రీవిష్ణు దగ్గరికి వస్తాడు. శ్రీ విష్ణు అసిస్టెంటైన బ్రహ్మాజీ.. అడవిలాగా ఉండే కూకట్ పల్లిలో రియల్ ఎస్టేటా అంటూ మండిపడతాడు. అప్పుడే 90ల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా నడిచే సినిమా ఇది అన్న ఇండికేషన్ ఇస్తారు. ఇలా ఆసక్తికరంగా మొదలవుతుంది ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ట్రైలర్. క్రికెటర్‌ గా జీవితం మొదలుపెట్టి అనుకోని విధంగా క్రిమినల్ అయిన వ్యక్తి పాత్రలో శ్రీవిష్ణు కనిపిస్తుంటే.. సొసైటీకి పెద్ద తలనొప్పిగా మారిన శ్రీవిష్ణును అంతం చేయడానికి నడుం బిగించే ముస్లిం పోలీస్ పాత్రలో నారా రోహిత్ దర్శనమిస్తున్నాడు. రోహిత్ తనదైన శైలిలో సీరియస్ డైలాగులు చెబుతూ ఆకట్టుకున్నాడు.

విశేషం ఏంటంటే.. నారా రోహిత్ కన్నా కూడా కథలో శ్రీవిష్ణుకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్లుగా కనిపిస్తోంది ట్రైలర్ చూుస్తుంటే. అసలు ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అని ఎవరి గురించి చెప్పబోతున్నారన్నదీ ఆసక్తికరమే. ట్రైలర్ మధ్యలో ఓ క్యారెక్టర్ ‘‘ఫైటింగ్ ఉంటుందా’’ అని అడగడం.. ‘‘మొత్తం ఫైటింగులే’’ అని మరో పాత్ర చెప్పడం సినిమాలో యాక్షన్ పార్ట్ కు ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజెప్పేదే. ‘అయ్యారే’ ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ‘అసుర’ దర్శకుడు కృష్ణవిజయ్ తో కలిసి ప్రశాంతి నిర్మిస్తోంది. నారా రోహిత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/