Begin typing your search above and press return to search.
పెళ్లి తర్వాతా ఆపిల్ బ్యూటీ రచ్చ
By: Tupaki Desk | 18 Jan 2023 2:30 AM GMTపెళ్లికి ముందు వేరు.. పెళ్లి తర్వాత వేరే! అనుకుంటే పొరపాటు. ఆపిల్ బ్యూటీ హన్సిక దుబాయ్ బిజినెస్ మేన్ ని పెళ్లాడి ఇటీవలే విదేశాల్లో హనీమూన్ ని ముగించుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట హనీమూన్ ఫోటోలు అంతకుముందే పెళ్లి ప్రపోజల్ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు అంతకుమించి హన్సిక చెలరేగి కొత్త ఫోటోషూట్ తో దుమారం రేపింది.
పెళ్లి తర్వాతా స్వేచ్ఛాయుత జీవనానికి కొదవేమీ లేదని నిరూపిస్తూ ఇప్పుడు హన్షిక లేటెస్ట్ ఫోటోషూట్ వేడెక్కిస్తోంది. రొటీనిటీకి భిన్నంగా కొత్త పళ్లికూతురు వైబ్స్ అస్సలు కనిపించనీకుండా థై అందాలను ఎలివేట్ చేస్తూ తెల్లటి చొక్కా - మెరిసే స్లిట్ పరికిణీలో తన అందాలను ఎలివేట్ చేసింది. సౌత్ నార్త్ పరిశ్రమల్లో ఒకటిన్నర దశాబ్ధాల కెరీర్ ని సాగించిన హాన్సికా మోత్వానీ ఆపిల్ బ్యూటీగా అభిమానుల గుండెల్లో స్థిరపడింది. ఆరంగేట్రమే బన్నీ సరసన 'దేశముదురు'తో ఉత్తమ అరంగేట్ర నాయికగా సౌత్ విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది.
అనంతరం దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ ఇన్నింగ్స్ సాగించింది. తెలుగులో దేశముదురు తరవాత మంచు కాంపౌండ్ లో వరుస సినిమాలు చేసింది. రవితేజ- రామ్ లతో హిట్ చిత్రాల్లో హన్షిక నటించింది. తమిళంలో థీయా వెలై- ఎంగేయుమ్ కాదల్- వెళాయుదుమ్ చిత్రాల్లో హన్సికా మోత్వానీ తనదైన నటనతో ఆకట్టుకుంది. 2018 చిత్రం గులేబాకావలి లో కాన్ ఆర్టిస్ట్ పాత్రతో ఆకట్టుకుంది. విక్రమ్ ప్రభు నటించిన తుప్పకి మునై- తెలుగు చిత్రం తెనాలి రామకృష్ణ బిఎల్ లో నటించింది. మహా టైటిల్ తో మరో ఆసక్తికర చిత్రంలోను హన్షిక నటించింది. బాల నటిగా చాలా సంవత్సరాల క్రితం టీవీ నటిగా తన వృత్తిని ప్రారంభించినప్పటి నుండి సుదీర్ఘ కెరీర్ ని కొనసాగించింది.
కెరీర్ లో ఇదో ఫేజ్.. సుందర్ సి 'అరణ్మయి 2' 2016 లో మిశ్రమ స్పందనలను అందుకుంది. ఆ సంవత్సరం తరువాత హన్సికాకు ఉయైర్ ఉయైర్ .. పోక్కిరి రాజా సెట్స్ పై ఉన్నాయి. 2016 లో విడుదల కానున్న ఆమె చివరి చిత్రం ఉధాయనిధి స్టాలిన్ నటించిన మనిథన్. 2017 చిత్రం బోగన్ మంచి ఆదరణ పొందింది. ప్రీ-క్లైమాక్స్ పరిచయ సన్నివేశాలలో హన్సిక అభినయానికి విమర్శకుల నుండి గొప్ప ప్రశంసలను దక్కాయి. తెలుగు చిత్రం లక్కున్నోడులో కూడా కనిపించింది. 2017 లో విడుదలైన విలన్ చిత్రంతో మలయాళ ఆరంగేట్రం చేసింది.
ఇటీవల సోషల్ మీడియాల్లో చాలా స్పీడ్ చూపిస్తోంది. హన్సికా మోత్వానీ వైట్ టాప్ - స్లిట్ స్కర్ట్ ధరించిన తన ఫోటోను అప్ లోడ్ చేశాడు. హన్సిక లేటెస్ట్ లుక్ ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ గా మారింది. వైట్ షర్ట్ స్పార్క్లీ స్లిట్ స్కర్ట్ మెరుపులు స్పార్క్లీ కళ్ళతో గుబులు పుట్టించింది. ఆపిల్ బ్యూటీ హాటెస్ట్ భంగిమలతో మతులు చెడగొట్టింది. మీ సూర్యరశ్మిని సృష్టించండి.. అనే వేడెక్కించే క్యాప్షన్ తో ఈ ఫోటోలను షేర్ చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.