Begin typing your search above and press return to search.

కబాలి వెనుక యాపిల్ బాక్స్ ఉంది!!

By:  Tupaki Desk   |   11 Sep 2016 1:30 PM GMT
కబాలి వెనుక యాపిల్ బాక్స్ ఉంది!!
X
సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ అంటే.. వందల కోట్లతో వ్యవహారం. గతంలో రజినీ-శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన రోబో చిత్రానికి 132 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఇప్పుడు రోబో సీక్వెల్ 2.0 కోసం 350 కోట్లు వెచ్చిస్తారని అంటున్నారు. రీసెంట్ గా విడుదల అయిన కబాలి చిత్రానికి కూడా 100 కోట్లు పైగానే ఖర్చు చేశామని చెప్పాడు నిర్మాత. అయితే.. ఇన్ని వందల కోట్ల ఖర్చులను ప్రొడ్యూసర్ ఎలా మేనేజ్ చేస్తాడు? కబాలి ప్రొడ్యూసర్ ఏం చేసి ఉంటాడు?

యాపిల్ బాక్స్ అనే సాఫ్ట్ వేర్ ను కబాలి చిత్ర నిర్మాణంలో ఉపయోగించారట. సినిమాల నిర్మాణం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సాఫ్ట్ వేర్ ని.. వారి అవసరాలకు అనుగణంగా రూపొందించారు. పూర్తిగా క్లౌడ్ ఆధారిత సాఫ్ట్ వేర్ తో నడిచే ఈ సాఫ్ట్ వేర్ ను కబాలి కోసం ప్రయోగాత్మకంగా ఉపయోగించాడు నిర్మాత కలైపులి ఎస్ థాను. దీని ద్వారా రియల్ టైమ్ లో ప్రతీ పైసా ఖర్చును అప్ డేట్ చేయవచ్చు. రిపోర్టులు జనరేట్ చేసుకోవచ్చు. ప్రొడక్షన్ అసిస్టెంట్స్ తాము చేసే ఖర్చులను దీనిలో పొందుపరిస్తే చాలు.. నిర్మాత ఎక్కడున్నాసరే.. ఓ కంట కనిపెట్టి ఉండవచ్చు.

తెరి.. కబాలి చిత్రాలకు ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాత.. ఈ సాఫ్ట్ వేర్ పై చాలామందికి నమ్మకం కలిగిందని అంటున్నారు. రెండు రకాల సబ్ స్క్రిప్షన్ ప్యాకేజ్ లతో అందిస్తుండగా.. త్వరలో అనేక సినిమాల నిర్మాణాల్లో ఈ సాఫ్ట్ వేర్ భాగం కానుందని తెలుస్తోంది.