Begin typing your search above and press return to search.
వర్మ కడప ని అడ్డుకోవాల్సిందే
By: Tupaki Desk | 21 Dec 2017 4:33 AM GMTటాలీవుడ్ లో ఎవరు ఏ పని చేసినా అంతగా హైప్ క్రియేట్ అవ్వకపోవచ్చు. కానీ విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడితే ఛాలు అది తప్పకుండా వైరల్ అవుతుంది. పట్టుకుంటే కాంట్రోవర్సీలనే పట్టుకోవాలని అనుకుంటాడో లేక చరిత్రను చూపించాలని అనుకుంటాడో తెలియదు గాని మొత్తానికి అనుకున్నది చేసి తీరతాడు. ఆ తరువాత ఏం జరిగినా తనదైన శైలిలో సమాధానం చెప్పి ఓ వర్గం వారికి కోపన్ని తెప్పిస్తూ మరో వర్గం వారిని చాలా ఆకట్టుకుంటాడు.
ఇక అసలు విషయానికి వస్తే.. ఇటీవల ఆయన కడప అనే వెబ్ సిరీస్ ట్రైలర్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఫ్యాక్షన్ నేపద్యంలో తెరకెక్కుతోన్న ఆ వెబ్ సిరీస్ ట్రైలర్ ఇప్పుడు ఓ వర్గం వారిని చాలా ఆకట్టుకుంటోంది. యూట్యూబ్ లో కింద కామెంట్స్ ని చూస్తే క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ మనకే అర్థమవుతోంది. అయితే కడపలోని కొందరు మాత్రం వర్మ వెబ్ సిరీస్ పై చాలా సీరియస్ అవుతున్నారు. కడపకు వస్తే తరిమి తరిమి కొడతామని వార్నింగ్ లు ఇస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రయివేట్ స్కూల్ అసోసియేషన్ (APPSA) కూడా వర్మపై చాలా సీరియస్ అవుతోంది.
వెంటనే ప్రభుత్వం ఆ వెబ్ సిరీస్ ని అడ్డుకోవాలని.. APPSA అసోసియేషన్ సెక్రటరీ రమణా రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. పోతులూరి వీర బ్రహ్మెంద్రస్వామి - అన్నమాచార్య - దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు బి ఎన్ రెడ్డి నాగిరెడ్డి ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం వంటి మహాపురుషులు ఈ గడ్డపై జన్మించారు. కానీ వర్మ కడప మొత్తాన్ని ఫ్యాక్షన్ అంటూ పోల్చడం నిజంగా దారుణమని వారు తెలిపారు. ఇక సినీ ప్రముఖులు కూడా వర్మ వెబ్ సిరీస్ ని అడ్డుకోవాలని తెలుపుతూ రాజకీయ నాయకులు కూడా ఈ విషయంపై స్పందించాలని తెలిపారు. మరి వర్మ వెనకడుగు వేస్తాడా లేక కంటిన్యూ చేస్తాడా అనేది చూడాలి.