Begin typing your search above and press return to search.
ఏప్రిల్ 14 బెట్టింగ్ 1000 కోట్లు అంతకుమించి!
By: Tupaki Desk | 22 Jan 2022 3:57 AM GMTకరోనా క్రైసిస్ సినిమా రంగాన్ని సర్వనాశనం చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి రెండు వేవ్ లతో చాలా వరకూ ఇండస్ట్రీలు మూత పడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఓమిక్రాన్ కేసులు వేగంగా పెరగడం ఇబ్బందికరంగా మారింది. అయితే ఈ పరిణామంతో విడుదలకు సిద్ధమైన చాలా భారీ చిత్రాల షెడ్యూల్స్ మారాయి. ఇప్పటికే వాయిదా వేసుకున్నివాటిని ఎప్పుడు రిలీజ్ చేయాలి? అన్న డైలమా నెలకొంది.
ఇప్పుడు ఒకదానితో ఒకటి పోటీపడుతూ మూడు భారీ పాన్ ఇండియా చిత్రాలు ఏప్రిల్ 14న విడుదలవుతున్నాయి. ఆ డేట్ ని లాక్ చేసామని మూడు టీమ్ లు అధికారికంగా ప్రకటించడంతో ఇప్పుడు అభిమానుల్లో డైలమా నెలకొంది. ఏ సినిమాని ముందుగా చూడాలన్నది ఇప్పుడు ఫ్యాన్స్ నిర్ణయించుకోలేని పరిస్థితి.
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చద్దా` రిలీజ్ డేట్ మారుతుందని ప్రచారం సాగినా కానీ.. యథాతథంగా ప్రకటించిన తేదీకే విడుదల చేస్తున్నామని అమీర్ ఖాన్ తాజాగా స్పష్ఠం చేశారు. ఇక రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ 2 ని ఏప్రిల్ 14న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ ఇద్దరితో పాటు దళపతి విజయ్ నటించిన `బీస్ట్` అదే డేట్ కి అత్యంత భారీగా విడుదల కానుంది. నిజానికి కేజీఎఫ్ 2.. బీస్ట్ చిత్రాలు పలుమార్లు రిలీజ్ తేదీలను మార్చుకున్నవే. సంక్రాంతికే రావాల్సిన బీస్ట్ ఓమిక్రాన్ ప్రభావంతో వాయిదా పడింది. కేజీఎఫ్ గత సమ్మర్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత దసరా అన్నారు. ఏడాది చివరిలో అయినా వస్తుందని ప్రచారం సాగింది. కానీ ఏదీ సాధ్యపడలేదు. సంక్రాంతి బరిలో ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ చిత్రం ఉండడంతో కేజీఎఫ్ 2ని వాయిదా వేసుకున్నారని ప్రచారమైంది.
ఏది ఏమైనా ఇప్పుడు ఏప్రిల్ 14 తేదీకే రావాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారమవుతోంది. ఈ మూడు చిత్రాలపై ఎంత తక్కువగా చూసుకున్నా వెయ్యి కోట్ల మేర బెట్టింగ్ ఉంటుందని ప్రచారమవుతోంది. అమీర్ -చైతన్యల లాల్ సింగ్ చద్దా.. హిందీతో పాటు తెలుగులోను విడుదలయ్యే వీలుంది. అలాగే బీస్ట్ ని తమిళం-తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నారు. కేజీఎఫ్ 2 ఇటు సౌత్ అటు నార్త్ రెండు చోట్లా విడుదలవుతుంది. ఇతర సినిమాల్ని డామినేట్ చేసేంత క్రేజుతో కేజీఎఫ్ 2 విడుదలవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే హిందీ నాట ఈ మూవీకి థియేటర్ల సమస్య తలెత్తడం ఖాయంగా చెబుతున్నారు. అమీర్ ఖాన్ కోసం ఎగ్జిబిటర్లు ప్రైమ్ ఏరియాల థియేటర్లను అప్పగించే వీలుంది.
లాల్ సింగ్ ప్రకటనతో ఇతరుల్లో హైటెన్షన్
అమీర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చద్దా` షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 14 న థియేటర్లలోకి వస్తుందని సినిమా విడుదల తేదీలో మార్పు గురించి ఊహాగానాలు తోసిపుచ్చుతూ మేకర్స్ శుక్రవారం తెలిపారు. లాల్ సింగ్ చద్దా వాయిదా పడిందని ఆగస్ట్ 11న విడుదల కావచ్చని వారం ముందు వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ కి స్వస్తి పలుకుతూ సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని చిత్ర బ్యానర్ అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది.
దాని ప్రకారం.. ``అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ లాల్ సింగ్ చద్దా విడుదల తేదీ 14 ఏప్రిల్ 2022న ఫిక్సయ్యాం. కొన్ని తప్పుదోవ పట్టించే కథనాలకు విరుద్ధ నిర్ణయమిది. ఈ చిత్రాన్ని రూపొందించే ప్రయాణంలో మాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ మేము మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము`` అని ప్రకటించారు.
ఈ చిత్రం 1994 హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫారెస్ట్ గంప్ కి అధికారిక రీమేక్. ఇందులో టామ్ హాంక్స్ నటించారు. హిందీ వెర్షన్ ను అతుల్ కులకర్ణి నిర్మిస్తున్నారు. 2017 డ్రామా `సీక్రెట్ సూపర్ స్టార్`కి దర్శకత్వం వహించిన అద్వైత్ చందన్ దీనికి దర్శకత్వం వహించారు. లాల్ సింగ్ చద్దా లో కరీనా కపూర్ ఖాన్- మోనా సింగ్ నటించారు. టాలీవుడ్ హీరో నాగ చైతన్య ఈ చిత్రంతోనే హిందీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.