Begin typing your search above and press return to search.

ఏప్రిల్ 20 మ‌హేష్ స్పెష‌ల్ డే..ఎందుకో తెలుసా!

By:  Tupaki Desk   |   20 April 2022 7:30 AM GMT
ఏప్రిల్ 20 మ‌హేష్ స్పెష‌ల్ డే..ఎందుకో తెలుసా!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ త‌న త‌ల్లి ఇందిరాదేవి గురించి ఎంత గొప్ప‌గా చెబుతారో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇంట‌ర్వ్యూల్లో మాతృమూర్తి పేరెత్త‌గానే మ‌హేష్ గ‌ల‌గ‌లా మాట్లాడుతారు. అమ్మ ఔన్న‌త్యాన్ని...గొప్ప‌త‌నాన్ని వ‌ర్ణించ‌డానికి ఎంతో ఆస‌క్తి చూపిస్తారు. మ‌హేష్ సినిమా రిలీజ్ కి ముందు టెన్ష‌న్ మొద‌లైతే అమ్మ‌చేతి కాఫీ తాగితే టెన్ష‌న్ ఇట్టే పోతుంది. మైండ్ ఫ్రీ అయిపోతుంది. రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోతారు. అమ్మ చేతి కాపీ కి ఉన్న గొప్ప‌త‌నం అని మ‌హేష్ ప్ర‌తీ సంద‌ర్భంలోనూ చెబుతుంటారు.

ఇందిరా దేవి బ‌య‌ట క‌నిపిచ‌డం దాదాపు అసాద్య‌మ‌నే చెప్పాలి. అప్పుడెప్పుడో మ‌హేష్ న‌టించిన ఓ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌కు వ‌చ్చారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ క‌నిపించ‌లేదు. అదీ మ‌హేష్ ఎంతో పట్టుబ‌డితే గానీ సాధ్య‌ప‌డ‌లేదు. కుమారుడి మాట తీయ‌లేక వ‌చ్చావారు ఆమె. కాగా నేడు ఏప్రిల్ 20 ఇందిరా దేవి పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మాతృమూర్తికి మ‌హేష్ త‌న‌దైన శైలిలో విషెస్ తెలిపారు.

"ఏప్రిల్ 20 నా జీవితంలో చాలా ప్రాముఖ్యమైన రోజు. ఎందుకంటే ఈ రోజు మా అమ్మపుట్టిన రోజు. హ్యాపీ బర్త్ డే అమ్మా'' అంటూ ఇందిరా దేవి.. మహేష్ బాబు కలిసున్న ఫొటోను షేర్ చేశారు. ఓ సినిమా ఈవెంట్ కోసం మ‌హేష్ త‌న త‌ల్లిని తీసుకొస్తున్న ఫోటోలో కనిపిస్తుంది.

ఇది చాలా రేర్ పిక్. ఆ క్ష‌ణాలు మ‌హేష్ త‌ల్లిని చూసి ఆనందంతో ఎంతో సంతోషంగా ఉన్నారు. త‌ల్లి చేతిని ప‌ట్టుకుని కుమారుడు అలా న‌డుచుకుంటూ వ‌స్తోన్న రేర్ ఫోటో ఇది.

సూప‌ర్ స్టార్ కృష్ణ తెరంగేట్రానికి ముందే ఇందిరదేవితో వివాహం అయింది. ఇందిరాదేవి కృష్ణకు స్వయానా మరదలు. పెద్ద‌ల అభిరుచి మేర‌కు పెళ్లి జ‌రిగింది. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు..ముగ్గురు కుమార్తెలు. రెండ‌వ కుమారు మ‌హేష్ సినిమా రంగంలో స్థిర‌ప‌డ‌గా..మిగ‌తా వారు వేర్వేరు రంగాల్లో స్థిర‌ప‌డ్డారు.

ఇందిరాదేవి పుట్టిన రోజు సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానులు..ఇండ‌స్ర్టీ ప్ర‌ముఖులు ఆమెకు శుభాకాక్ష‌లు తెలుపుతున్నారు. మ‌హేష్‌-ఇదిరా దేవి క‌లిసి ఉన్న ఫోటోల్ని షేర్ చేసి అభిమానం చాటుకుంటున్నారు. కొంత మంది అభిమానులు ఏకంగా త‌ల్లిబిడ్డ‌ల‌ని ప్రేమ‌ని క‌విత‌ల రూపంలోనే వ‌ర్ణిస్తున్నారు. తెలుగు ప‌రిశ్ర‌మ‌కి గొప్ప అంద‌మైన‌..ప్ర‌తిభావంతుడైన న‌టుడ్ని అందించారు అమ్మా! అంటూ ప్రేమ‌ని కురిపిస్తున్నారు.