Begin typing your search above and press return to search.

అప్సరస అందాలకు ఎవరైన పడిపోవాల్సిందే..!

By:  Tupaki Desk   |   4 Nov 2022 2:30 AM GMT
అప్సరస అందాలకు ఎవరైన పడిపోవాల్సిందే..!
X
ఈమధ్య ఆర్జీవి ప్రమోట్ చేస్తున్న భామలకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఆర్జీవి బోల్డ్ సినిమాల్లో నటిస్తే టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కినట్టే ఈ ఫార్ములాని కనిపెట్టిన అప్సరా రాణి ఆయన చేసిన రెండు సినిమాల్లో నటించింది.

అందులో ఒకటి థ్రిల్లర్ కాగా రెండవది డేంజరస్. ఆర్జీవి ఫోకస్ అంతా అప్సరా అందాల మీద ఉంచడంతో అమ్మడికి బాగానే ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ దెబ్బతో అప్సరాకి స్పెషల్ ఐటం సాంగ్ ఆఫర్లు వస్తున్నాయి. క్రాక్ లో భూం బద్ధలు సాంగ్ తో ఓ ఊపు ఊపేసింది అప్సరా రాణి. ఆ సాంగ్ తో అమ్మడి క్రేజ్ మరింత పెరిగిందని చెప్పొచ్చు.

ప్రస్తుతం ఐటం సాంగ్స్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్న అప్సరా రాణి కేవలం సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలో కూడా అందాల ప్రదర్శనతో అదరగొట్టేస్తుంది. బికినీ షోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న అమ్మడు తన ఫాలోవర్స్ ని ఎంటర్టైన్ చేయడమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుంది. అందుకే ఎలాంటి మొహమాటం లేకుండా తన అందాలతో గ్లామర్ ట్రీట్ అందిస్తుంది. లేటెస్ట్ గా అప్సరా రాణి శారీ లుక్ తో ఆకర్షిస్తుంది. కొత్త సినిమా ఓపెనింగ్ కి వచ్చిన అమ్మడు అక్కడ శారీ లో ఫోటో షూట్ ఇచ్చింది. కట్టింది శారీనే కానీ స్లీవ్ లెస్ బ్లౌజ్ తో హాట్ అప్పీల్ చేస్తుంది అప్సరా రాణి.

టాలీవుడ్ లో ఐటం సాంగ్స్ తో స్పెషల్ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్న అప్సరా రాణికి ఆమె కోరినట్టే ఆఫర్లు వస్తున్నాయి. స్క్రీన్ మీద కనిపించడానికి ఎలాంటి పాత్ర అయినా సరే చేయడానికి సిద్ధమని చెబుతున్న అప్సరా రాణి తన గ్లామర్ ట్రీట్ తో ఫాలోవర్స్ కి నిద్రపట్టకుండా చేస్తుంది.

లేటెస్ట్ గా శారీ లుక్ తో కనిపించిన అప్సరా రాణి అలా కూడా తన మెరుపులు మెరిపిస్తుంది. గ్లామర్ షోలో నో లిమిట్స్ మాత్రమే కాదు ఇంటిమేట్ సీన్స్ లో కూడా సై అనేస్తున్న అప్సరా రాణితో ఆర్జీవి ఇంకా ఏదో ప్లానింగ్ లో ఉన్నట్టు ఉన్నాడు. అందుకే ఆమెని రెగ్యులర్ గా ఫాలో అవుతూ అప్సరా రాణికి ట్యాగ్ చేస్తూ మెసేజ్ లను పోస్ట్ చేస్తూ ఉంటాడు.

ఆర్జీవి వెలుగులోకి తీసుకొచ్చిన అందాల ముద్దుగుమ్మ అప్సరా రాణి ఆయనతో ఎలాంటి సినిమా అయినా చేయడానికి రెడీ అంటుంది. అందుకే అప్సరా, నైనా గంగూలితో కలిసి ఓ లెస్బియన్ లవ్ స్టోరీ గా డేంజరస్ తీశాడు. ఆ సినిమాలో అప్సరా, నైనాల పర్ఫార్మెన్స్ చూస్తే వీళ్లు నిజంగానే లెస్బియన్ అనేలా చేశారు. మొత్తానికి ఆర్జీవి బ్యూటీ తన కెరియర్ ని సెట్ రైట్ చేసుకునే క్రమంలో అదరగొట్టేస్తుంది. లేటెస్ట్ గా ఓ సినిమా ముహుర్తానికి వచ్చిన అప్సరా రాణి అక్కడ ఉన్న వారందరిని తన గ్లామర్ తో ఆకట్టుకుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.