Begin typing your search above and press return to search.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పై ఆప్టే షాకింగ్ ఆరోపణలు!
By: Tupaki Desk | 22 May 2021 3:30 PM GMTఫలానా టాలీవుడ్ ప్రముఖ హీరోతో ఇబ్బంది పడ్డానని నిర్మొహమాటంగా ఆరోపించిన `రక్త చరిత్ర` బ్యూటీ రాధిక ఆప్టే.. ఇటీవల కాస్త స్థబ్ధుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఆప్టే గాళ్ ఘాటు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఆయనతో ఓ సినిమాకి అంగీకరించాను. కానీ తక్కువ వేతనంతో పని చేయాల్సి వచ్చిందని వాపోయారు. తొలుత ఆ సినిమాని ఒకే భాషలో రిలీజ్ చేస్తామని నాతో చెప్పారు. కానీ తెలుగు-తమిళం రెండు భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు నాతో డబుల్ వర్క్ చేయించారు.
ఆ సినిమాకి పని చేసిన సమయంలో గంటల కొద్దీ సమయం సెట్లో వేచి చూడాల్సి వచ్చేది. నాతో పని చేసే హీరోలంతా పెద్ద వాళ్లు కావడంతో వారు రావడం ఆలస్యమయ్యేది. అప్పటివరకూ వేచి చూడాల్సి వచ్చేది.. అని తనలోని భడభాగ్నిని రాధిక పబ్లిగ్గా ఓపెనయ్యారు. తెలుగు సినీపరిశ్రమలో ఇలానే ఉంటుందని సరిపెట్టుకున్నానని తెలిపారు. ఇంతకీ అది ఏ సినిమా కి ఆ దర్శకుడు ఎవరు? అని ప్రశ్నిస్తే.. రక్త చరిత్ర సినిమా కోసం ఆర్జీవీతో పని చేసినప్పటి అనుభవమిదని తెలిపారు. RGV రక్త చరిత్ర విషయంలో తాను దోపిడీకి గురయ్యానని అన్నారు.
ఇటీవలి ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే బాలీవుడ్లో తన ప్రారంభ అనుభవాలను వివరిస్తూ ఒక చిత్రంలో ఉచితంగా పనిచేయమని దర్శకుడు అడిగారని తెలిపారు. ఆ నిర్మాణ సంస్థ సరైనది కాదని ఆరోపించారు.
సేక్రేడ్ గేమ్స్ నటుడు దర్శకుడు మహేష్ మంజ్రేకర్ తో కలిసి `వాహ్! లైఫ్ హో తో ఐసి` కోసం నాకు పారితోషికం చెల్లించలేమని వారు చెప్పారు. ఉచితంగా పని చేయమని నన్ను అడిగారు. సెట్లో ఉన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టులకు కూడా డబ్బులు వస్తున్నాయని నేను గ్రహించాను.. సదరు ప్రొడక్షన్ హౌస్ విధానం చెడ్డది అని ఆమె అభివర్ణించారు.
కానీ షోర్ ఇన్ ది సిటీలో నటించినప్పటి అనుభవం వేరని తెలిపారు. మూడు రోజుల కోసం 72వేల రూపాయలను రాజ్ అండ్ డీకే బృందం పే చేశారని ఈ చిత్రంలో ఎక్కువ భాగం కావాలని వారు కోరుకుంటున్నందున ఆ తరువాతా వారు తనకు కాల్ చేశారని తెలిపారు. ఆప్టే ఇటీవల `ఓకే కంప్యూటర్` సిరీస్ లో నటించారు. తదుపరి `మిసెస్ అండర్ కవర్` చిత్రంలోనూ కనిపంచనున్నారు.