Begin typing your search above and press return to search.
డబ్బింగ్ నిర్మాతల వైఫల్యం!
By: Tupaki Desk | 17 Nov 2018 5:57 AM GMTడబ్బింగ్ సినిమాలు లాభమా.. నష్టమా? ఇది అన్నివేళలా ఎడతెగని డిబేట్. అనువాద చిత్రాలతో కలిసొస్తే పెద్ద రేంజులోనే కలిసొస్తుంది. ఒక్కోసారి దెబ్బ పడిపోతే అంతే పెద్ద రేంజులో పంచ్‌ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అండర్ ప్రొడక్షన్ ఎలాంటి నొప్పులు భరించకుండా.. హాట్ కేక్‌లా రెడీగా ఉన్న సినిమాని కొనుక్కుని అప్పటికప్పుడు రిజల్ట్ ని ఫేస్ చేసే సన్నివేశం డబ్బింగ్ నిర్మాతలకు ఉంటుంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి ఏది సూటబుల్ అన్నది ఎంచుకోవడంలోనే డబ్బింగ్ నిర్మాతల్లో కళా దృష్టి ఎంత అన్నది తేల్తుంది. ఓవర్ నైట్ ఫేట్ మారొచ్చు.. అదే ఓవర్ నైట్ లో ఉన్న సొమ్ములన్నీ పోగొట్టుకున్న వాళ్లు ఉన్నారు.
ఇటీవల కొన్ని నిర్మాణ సంస్థలు ఐపు లేకుండా పోవడమే అందుకు సాక్ష్యం. దాదాపు దశాబ్ధ కాలంగా డబ్బింగ్ సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రఖ్యాత నిర్మాణ సంస్థలు లక్ష్మి గణపతి మూవీస్ - మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్ మెంట్స్ - ఎస్వీఆర్ మీడియా లాంటి సంస్థలు ఎందుకనో డబ్బింగ్ సినిమాలపై ఇటీవల పెద్దంతగా ఆసక్తి కనబరచడం లేదు. ఆ క్రమంలోనే డబ్బింగ్ రిలీజ్ లు తగ్గాయి. గతంలో తమిళ - మలయాళ చిత్రాలు సహా హాలీవుడ్ చిత్రాల్ని సదరు సంస్థలు అందించాయి. కానీ ఇటీవల ఈ సంస్థల ఉనికి కనిపించడం లేదు.
వీళ్లంతా సినిమాలు చేయకపోవడానికి కారణం సరిగా గిట్టుబాటు లేక.. చేతులు కాల్చుకుని వైదొలగారన్న మాటా వినిపించింది. ముఖ్యంగా లక్ష్మి గణపతి ఫిలింస్ సుబ్రమణ్యంకి రజనీకాంత్ `కొచ్చాడయాన్` రూపంలో పెద్ద పంచ్ పడింది. ఆ సినిమా ఆర్థిక వివాదాలు ఏకంగా కంపెనీనే దివాళా తీయించాయి. ఆ సినిమా తెచ్చిన ఆర్థిక చిక్కులపై నిన్న మొన్నటివరకూ చాంబర్ పరిధిలో సుబ్రమణ్యం పోరాడారు. మల్టీడైమన్షన్ సంస్థ భారీ హాలీవుడ్ చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించేది. కానీ ఇటీవల ఆ సంస్థ హాలీవుడ్ అనువాదాల్ని పట్టించుకోవడం లేదు. ఒక్కోసారి
ప్రచార బడ్జెట్లు అయినా తిరిగి రానంత పంచ్ పడుతుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
మరోవైపు హాలీవుడ్ 3డి సినిమాలపై తెలుగు ఆడియెన్ లో ఆసక్తి పెరుగుతోంది. ఇదివరకటితో పోలిస్తే హాలీవుడ్ సినిమాలపై అవేర్ నెస్ పెరిగింది. ఇరుగు పొరుగు భాషల చిత్రాల్ని మన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇటీవల రిలీజైన జంగిల్ బుక్ - జురాస్సిక్ వరల్డ్ - అవెంజర్స్ 2 చిత్రాల సక్సెస్ దానిని నిరూపించింది. మునుముందు 3డి థియేటర్ల పెంపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం ఉంది. తాజాగా హాలీవుడ్ నుంచి `అక్వామేన్` చిత్రాన్ని ప్రాంతీయ భాషల్లో అనువాదమై రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని `సముద్ర పుత్రుడు` పేరుతో ఎన్ విఆర్ సినిమాస్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఎన్ విఆర్ సినిమాస్ (ఎన్ వి ప్రసాద్- దిల్ రాజు- యువి క్రియేషన్స్ వంశీ) బృందం అక్వామేన్ ఇండియా వైడ్ రిలీజ్ హక్కుల్ని చేజిక్కించుకుంది. కాంజురింగ్ ఫేం జేమ్స్ వాన్ దర్శకత్వంలో వార్నర్ బ్రదర్స్ - డీసీ కామిక్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇదివరకూ రిలీజైన ట్రైలర్ కి అద్భుత స్పందన వచ్చింది. డిసెంబర్ 14న తెలుగు - తమిళం - హిందీలో 2డి - 3డి - ఐమ్యాక్స్ 3డిలో ఈ సినిమా రిలీజవుతోంది.