Begin typing your search above and press return to search.
పాతిక అవతారాల్లో ఎ.ఆర్.రెహమాన్
By: Tupaki Desk | 3 Jan 2018 4:58 AM GMTఎ.ఆర్.రెహమాన్. ఆ పేరొక సంగీత తరంగం. రెండు దశాబ్దాలకు పైగా భారతీయులను ఆకట్టుకుంటూనే ఉన్న మ్యూజిక్ మాంత్రికుడు. ఈమధ్య వరసపెట్టి ఆయన ఆల్బమ్స్ ఆకట్టుకోలేకపోతున్నా టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఈరోజుకు కూడా ఆ పేరు వినిపిస్తూనే ఉంటుంది. సౌత్ లో మరీ ముఖ్యంగా తమిళంలో టాప్ రేంజి సినిమాలను రెహమాన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఏరికోరి పెట్టుకుంటారు.
ఎ.ఆర్.రెహమాన్ తన మ్యూజిక్ తో ఎంతమందిని... ఏవిధంగా ఇంప్రెస్ చేశాడో చెప్పాలన్నా.. లెక్కలు తేల్చాలన్నా కాస్త కష్టమే. కానీ ఆయనను ఇంప్రెస్ చేసే అంశాలు తక్కువే ఉంటాయి. అందునా మరీ ఇంప్రెస్ అయిపోయి సోషల్ మీడియాలో షేర్ చేసేంత విషయాలయితే మరీ తక్కువే ఉంటాయి. కానీ రెహమాన్ ను ఆ రేంజిలో మెప్పించాడో చిత్రకారుడు. చెన్నైకు చెందిన శ్రీధర్ ఈ మధ్య ఓ వైవిధ్యమైన చిత్రం గీశాడు. ఈ చిత్రంలో రెహమాన్ 25 రకాల గెటప్పుల్లో 25 రకాల మ్యూజిక్ ఇన్ స్ట్రుమెంట్స్ ను ప్లే చేస్తున్నట్టుగా చిత్రించాడు. 25 మంది ఒక్కరే అయినా అదో గ్రూప్ ఫొటో అనిపించేత వైవిధ్యంగా ఉంటుంది. రెహమాన్ లోని మ్యూజిక్ టాలెంట్ ను పరిచయం చేయడానికి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదేమో అన్నట్టుగా ఈ చిత్రం ఉంటుంది.
అందుకేనేమో ఈ చిత్రం చూసి రెహమాన్ కూడా తెగ ఇంప్రెస్ అయిపోయాడు. ఈ చిత్రం గీసిన శ్రీధర్ తనపై చూపిన ప్రేమ - గౌరవం తనను కదిలించేశాయంటూ కామెంట్ కూడా పెట్టాడు. పనిలో పనిగా మా చెన్నైకు చెందిన ఆర్టిస్టు అంటూ తన సొంతూరిపై అభిమానాన్ని కూడా ఇదే కామెంట్ లో చూపించాడు.