Begin typing your search above and press return to search.
హాలీవుడ్ అవేంజర్స్ కు మనోడి సాయం
By: Tupaki Desk | 27 March 2019 10:47 AM GMTహాలీవుడ్ మూవీ అవేంజర్స్ సిరీస్ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రజాధరణ ఉన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా ఇండియాలో అవేంజర్స్ సినిమాలకు అద్బుతమైన స్పందన ఉంటుంది. హిందీతో పాటు పలు సౌత్ భాషల్లో కూడా అవేంజర్స్ విడుదల అయిన విషయం తెల్సిందే. ఇప్పుడు అవేంజర్స్ సిరీస్ నుండి కొత్తగా రాబోతున్న 'అవేంజర్స్ ఎండ్ గేమ్' విడుదలకు సిద్దం అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 26న వేల థియేటర్లలో ఈ చిత్రం విడుదల కాబోతుంది. రికార్డు స్థాయిలో ఈ చిత్రం వసూళ్లు ఉంటాయని ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నారు. ప్రతి సారి ఇండియాలో చాలా విభిన్నంగా ఈ చిత్రంకు ప్రమోషన్స్ నిర్వహించే మేకర్స్ ఈసారి ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ సాయం తీసుకుంటున్నారు.
ఇండియాలో విడుదల కాబోతున్న అవేంజర్స్ ఎండ్ గేమ్ సినిమా కోసం ఒక ఆంతంను రహమాన్ రూపొందించాడు. హిందీతో పాటు తెలుగు - తమిళంలో ఈ ఆంతం ఉంటుందని తెలుస్తోంది. రహమాన్ సినిమా కథను అనుసారంగా ఆంతంను రూపొందించారని - తప్పకుండా ఇది సినిమాను సాదారణ జనాల్లోకి తీసుకు వెళ్లేలా ఉంటుందని ఫిల్మ్ బయ్యర్లు అంటున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన ఏఆర్ రహమాన్ తమ సినిమా కోసం ఆంతంను చేయడం చాలా సంతోషంగా ఉందని - తప్పకుండా ఈ చిత్రం అంచనాలను అందుకునేలా ఉంటుందనే నమ్మకంను అవేంజర్స్ ఫిల్మ్ మేకర్ బిక్రమ్ తుక్కల్ అన్నారు. రహమాన్ మాట్లాడుతూ నా కుటుంబంలోనే అవేంజర్స్ కు పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. సినిమాకు తగ్గట్లుగా ఆంతంను రూపొందించాను. ఇది సినిమా అభిమానులకే కాకుండా సగటు సంగీత ప్రేమికుడికి కూడా నచ్చే విధంగా ఉంటుందని అన్నాడు.