Begin typing your search above and press return to search.
సినిమావాడినే అల్లుడిగా తెచ్చుకున్న ఏ.ఆర్.రెహమాన్
By: Tupaki Desk | 7 May 2022 4:09 AM GMTఆస్కార్ .. గ్రామీ పురస్కారాల విజేత లెజెండరీ స్వరకర్త AR రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ ఓ ఇంటిది అయ్యింది. అయితే రెహమాన్ తన ఇంటికి ఎలాంటి అల్లుడిని తెచ్చుకున్నాడు? అంటే.. మరో సినిమా వాడినే తన ఇంటి అల్లుడిగా తెచ్చుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
ఆడియో ఇంజనీర్ రియాస్దీన్ షేక్ మొహమ్మద్ ను రెహమాన్ అల్లుడిని చేసుకున్నాడు. అతడి కుమార్తె ఖతీజా ఇంజినీర్ అయిన షేక్ ని వివాహం చేసుకుంది. రెహమాన్ ఈ విషయాన్ని తన ఫాలోవర్స్ తో సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. అతను వివాహ వేడుక నుండి కుటుంబ చిత్రాన్ని పోస్ట్ చేసారు. అందులో వధూవరులు కూర్చుని ఉన్న చోట తన దివంగత తల్లి చిత్రపటం కూడా కనిపిస్తోంది. AR రెహమాన్ అతని పెద్ద కుమార్తె రహీమా.. అతని భార్య సైరా బాను .. అతని కుమారుడు అమీన్ వారి వెనుక నిలబడి ఉన్నారు. సర్వశక్తిమంతుడు ఈ జంటను ఆశీర్వదిస్తాడు. మీకు శుభాకాంక్షలు అనంతమైన ప్రేమ @khatija.rahman @riyasdeenriyan #nikkahceremony #marriage” అని క్యాప్షన్ లో రెహమాన్ రాశారు.
గాయని అయిన ఖతీజా 29 డిసెంబర్ 2021న రియాస్దీన్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. కృతిసనన్ నటించిన `మిమీ` కోసం ఆమె `రాక్ ఎ బై బేబీ` సహా పలు పాటలను పాడగా.. రియాస్దీన్ తరువాతి షోల కోసం AR రెహమాన్ తో కలిసి పనిచేసారు. సంగీత స్వరకర్త అమిత్ త్రివేదితోను ఆడియో ఇంజినీర్ గా అతడి కెరీర్ కొనసాగింది. రియాస్దీన్ ఇన్ స్టాలో అతను AR రెహమాన్ ప్రత్యక్ష సంగీత కచేరీ ని ప్రదర్శించారు. 2017 నాటి ప్రదర్శనలలో రెహమాన్ కి ఆడియో ఇంజినీర్ గా కలిసి పని చేసారని ఈ వీడియో చెబుతోంది.
2017 లో విడుదలైన `మెర్సల్`లో తన మామతో కలిసి రియాస్దీన్ షేక్ ఆడియో ఇంజినీర్ గా పనిచేశాడు. విజయ్- సమంత -కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో నటించగా అట్లీ దర్శకత్వం వహించారు. మెర్సల్ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తానికి సినిమావాడినే అల్లుడిగా తెచ్చుకున్న ఏ.ఆర్.రెహమాన్ అంటూ ఇప్పుడు నెటిజనుల్లో వాడి వేడిగా చర్చ సాగుతోంది. ఏ.ఆర్.రెహమాన్ తన సంగీత విభాగం నుంచే ఇంటి అల్లుడిని వెతికారు అంటూ గుసగుస వేడెక్కిస్తోంది. ఆ కుటుంబం అంతా సంగీతానికి సినిమాకి అంకితమైందని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
రెహమాన్ ఇటీవల నిర్మాతగానూ మారి సినిమాలు తీస్తున్నారు. 99 సాంగ్స్ తర్వాత ఆయన నుంచి వరుస సినిమాలను అభిమానులు కోరుకుంటున్నారు. అయితే దానికి సంబంధించిన ప్రకటన ఏదీ వెలువడ లేదు. విమర్శకుల ప్రశంసలు పొందిన 99 సాంగ్స్ కి రెహమాన్ స్వయంగా రచయితగాను పని చేసారు. ఇటీవల రెహమాన్ సౌత్ సినిమాలకు పని చేస్తున్నది చాలా తక్కువ. ఇది అభిమానులను నిరాశపరుస్తోంది