Begin typing your search above and press return to search.

రెహ్మాన్‌ ఏం చెప్పాడో.. అర్ధంకాలే!!

By:  Tupaki Desk   |   24 Nov 2015 6:23 PM GMT
రెహ్మాన్‌ ఏం చెప్పాడో.. అర్ధంకాలే!!
X
''మన దేశం చాలా అల్ర్టా సివిలైజ్డ్‌ సొసైటీ. మనం ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్‌ గా ఉండాలి. అసహనం గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు కాని.. దానిని మనం అహింసాత్మక మార్గంలో.. గాంధేయ మార్గంలో.. ఎదుర్కోవాలి కాని.. ఇలా కొట్టుకొని కామెంట్లు చేసుకోకూడద'' అంటూ వ్యాఖ్యానించాడు చెన్నయ్‌ మ్యూజిక్‌ వీరుడు.. ఆస్కార్‌ దిగ్గజం ఏ.ఆర్‌.రెహమాన్‌.

అసలు మనోడు ఏం చెబుతున్నాడో ఎవరికైనా అర్ధమైందా? బాబూ.. ఇన్టాలరెన్స్‌ పేరుతో జనాలు వాగ్వివాదాలు చేసుకోవడమే కాని.. ఎక్కడైనా కొట్టేసుకుని బట్టలు చింపేసుకున్నారా? అలాంటప్పుడు గాంధేయ మార్గం.. అహింసాత్మక సూత్రం.. ఏంటయ్యా ఇదంతా?? ఇకపోతే అమీర్‌ ఖాన్‌ చేసిన కామెంట్లకు అందరూ క్రిటిసైజ్‌ చేస్తున్నారు కదా అంటే.. ''అవును నేను కూడా గతంలో అలాంటివి ఎదుర్కొన్నా'' అన్నాడు. ఇంతకీ ఏం ఎదుర్కొన్నావ్‌ గురూ? రెహ్మాన్‌ ను ఆ రేంజులో ఎవరు విమర్శించారు అసలు? ఇంతకీ మనోడు అమీర్‌ ఖాన్‌పై జాలి పడుతున్నాడా ఏంటి?

తన సంగీతమే ఫాస్టు ఫాస్టుగా కాస్త అర్ధంకాని నానుడిలో ఒక్కోసారి సాగుతుంది అనుకున్నాం.. మరి రెహ్మాన్‌ కామెంట్లు కూడా అంతే అనుకుంట.