Begin typing your search above and press return to search.
రెహమాన్ నోట...మరో వివాదాస్పద మాట!
By: Tupaki Desk | 8 Sep 2017 4:36 PM GMTప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఎప్పుడో గానీ నోరు తెరవరు. అయితే ఎప్పుడు ఆయన నోరు తెరిచినా... తప్పనిసరిగా వివాదాస్పద మాట ఖాయమేనన్న వాదన కాదనలేనిదే. భారతీయ చలన చిత్ర ఖ్యాతిని ఆస్కార్ అవార్డులు సాధించే దాకా తీసుకెళ్లిన రెహమాన్... సంగీత దర్శకుల్లో గొప్ప వ్యక్తిగానే చెప్పుకోవాలి. అయితే ఆయన నోటి నుంచి వస్తున్న కామెంట్లు మాత్రం ఆయన స్థాయిని తగ్గించేస్తున్నాయని చెప్పక తప్పదు. అయినా ఇప్పుడు రెహమాన్ అంత కాని పని ఏం చేశారనేగా మీ ప్రశ్న?
అక్కడికే వస్తున్నాం. మొన్న కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మహిళా జర్నలిస్టుగా వృత్తి జీవితాన్ని గడుపుతున్న లంకేశ్... పలు అంశాలపై సంచలన కథనాలు రాశారని - ఈ కథనాలు గిట్టని కొందరు వ్యక్తులు ఆమెను హత్య చేయించారని కథనాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నిజాలను నిర్భయంగా రాస్తున్న మహిళా జర్నలిస్టును హత్య చేశారంటూ దేశవ్యాప్తంగా అన్ని వర్గాలకు చెందిన ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే లంకేశ్ మృతిని ప్రస్తావిస్తే... ఏఆర్ రెహమాన్ కాస్తంత ఘాటుగా స్పందించారు. గౌరీ లంకేశ్ హత్యను తీవ్రంగా ఖండించిన రెహమాన్... ఇలాంటి ఘటనలు జరిగితే... భారత్ తన దేశం కాదని ఆయన సంచలన ప్రకటన చేశారు. తన తాజా చిత్రం *వన్ హార్ట్: ద ఏఆర్ రెహమాన్ కాన్ సర్ట్ ఫిల్మ్* స్పెషల్ ప్రీమియర్ కు హాజరైన సందర్భంగా రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రీమియర్ కు హాజరైన రెహమాన్‌ను చుట్టుముట్టిన మీడియా ప్రతినిధులు గౌరీ లంకేశ్ హత్యపై మీరేమంటారని ప్రశ్నించారట.
దీంతో తన స్వరం సవరించుకున్న రెహమాన్ లంకేశ్ హత్యకు - దేశానికి - దేశ పౌరసత్వానికి ముడిపెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా రెహమాన్ ఏమన్నారన్న విషయానికి వస్తే.. *ఇలాంటి ఘటనలు భారత్ లో చోటుచేసుకోవు. అయితే ఇలాంటి ఘటనలు ఇక్కడ జరిగితే మాత్రం... భారత్ నా దేశం కాదు. ఈ ఘటన చాలా విచారకరం. నా దేశం మరింత సహనంగా ఉండాలని కోరుకుంటున్నాను* అని రెహమాన్ అన్నారు. మరి ఈ వ్యాఖ్యలు ఎంతటి దుమారం లేపుతాయో చూడాలి.