Begin typing your search above and press return to search.

మేం స్పెషల్.. మా మీద ఫత్వాలు ఉన్నాయ్

By:  Tupaki Desk   |   22 Nov 2017 11:29 AM IST
మేం స్పెషల్.. మా మీద ఫత్వాలు ఉన్నాయ్
X
తమకు వ్యతిరేకంగా ఫత్వా జారీ కావడాన్ని చాలమంది మహమ్మదీయులు అవమానంగా భావిస్తారు. కానీ ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ మాత్రం.. ఈ అంశాన్ని డిఫరెంట్ గా ప్రస్తావించాడు. ఇరానియన్ ఫిలిం మేకర్ మాజిద్ మాజిది పై.. తనపై పలు మార్లు ఫత్వాలు జారీ అయ్యాయని.. తాము చాలా ప్రత్యేకమైన వ్యక్తులం అని చెప్పడం విశేషం.

గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జరుగుతోంది. తొలి రోజున ఈ కార్యక్రమానికి ఏఆర్ రెహమాన్ తో పాటు.. మాజిద్ మాజిది కూడా అటెండ్ అయ్యారు. 2015లో వచ్చిన మొహమ్మద్: ది మెసెంజర్ ఆఫ్ గాడ్ చిత్రానికి గాను తమపై ఫత్వాలు జారీ అయిన విషయాన్ని గుర్తు చేసిన ఏఆర్ రెహమాన్.. బెయాండ్ ద క్లౌడ్స్ అంటూ తమ తర్వాతి ప్రాజెక్టు ఉంటుందని చెప్పుకొచ్చారు. 'అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన మాజిద్ మాజిది వంటి తో కలిసి వర్క్ చేయడం ఎంతో సంతోషం కలిగించే విషయం. ఆయన ఎంతో ధైర్యం ఉన్న వ్యక్తి. మా ఇద్దరి మీదా ఫత్వాలు జారీ అయ్యాయి. మేము ఎలైట్ సొసైటీకి చెందిన వ్యక్తులం' అంటూ నవ్వేశారు రెహమాన్.

ఇషాన్ ఖట్టర్.. మాళవికా మోహనన్ కలిసి నటించిన బెయాండ్ ద క్లౌడ్స్ చిత్రం కోసం ప్రస్తుతం వీరు కలిసి పని చేస్తున్నారు. అన్నా-చెల్లెళ్ల రిలేషన్ షిప్ ఈ చిత్రానికి మూలకథగా ఉంటుంది.