Begin typing your search above and press return to search.
ఫస్ట్ లుక్ : రెహమాన్ చూపే రియాలిటీ
By: Tupaki Desk | 27 April 2017 6:00 AM GMTడబుల్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఖ్యాతి గడించాడు. ఒకే ఏడాది మూడు సినిమాలకు నామినేషన్స్ పొందిన ఘనత కూడా సంపాదించాడు. భారత దేశ సంగీత దర్శకుడిగా ఎన్నెన్నో మెట్లు ఎక్కేసిన ఈ మ్యూజిక్ మాస్టర్.. ఇప్పుడు మరో రంగంలోకి కూడా అడుగుపెడుతున్నాడు.
'లె మస్క్' అనే మూవీని తనే దర్శకత్వం వహిస్తూ రూపొందిస్తున్నాడు ఏఆర్ రెహమాన్. ఇది షార్ట్ ఫిలిం కాగా.. దీన్ని వర్చువల్ రియాలిటీ టెక్నాలజీతో తెరకెక్కిస్తుండడం విశేషం. నోరా అర్నెజడర్.. మునిరిహ్ గ్రేస్ నటించే ఈ చిత్రంతో డైరెక్టర్ గా తన ట్యాలెంట్ చూపించనున్నాడు రెహమాన్. ఇప్పుడీ మూవీకి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. బ్లూ థీమ్ బ్యాక్ గ్రౌండ్ తో రెడ్ కలర్ డ్రెసింగ్ లో ఉన్న హీరోయిన్.. రెయిలింగ్ పై చేతులు ఆనించిన పిక్చర్ ను ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేశారు. వర్చువల్ రియాలిటీ సనిమా ఎక్స్ పీరియన్స్ బై ఏఆర్ రెహమాన్ అంటూ పోస్టర్స్ వేయడం విశేషం.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ షార్ట్ ఫిలిం స్టోరీని రెహమాన్ తన భార్య సైరా రెహ్మాన్ సహకారంతో స్వయంగా రాశాడు. అంతే కాదు.. తనే సహ నిర్మాణం కూడా చేస్తున్నాడు. వైఎం ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని కెనడా నిర్మాణ సంస్థ ఐడియల్ ఎంటర్టెయిన్మెంట్ రూపొందిస్తోంది. మే 10వ తేదీన టీజర్ రిలీజ్ చేసేందుకు రెహమాన్ సిద్ధమవుతున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/