Begin typing your search above and press return to search.

'అరణ్య' వసూళ్లు తగ్గడానికి కారణాలు అవేనా?

By:  Tupaki Desk   |   31 March 2021 5:30 PM GMT
అరణ్య వసూళ్లు తగ్గడానికి కారణాలు అవేనా?
X
టాలీవుడ్ లో రానాకి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. మొదటి నుంచి ఆయన తమిళ .. హిందీ సినిమాలు చేస్తుండటం వలన, అక్కడ కూడా మంచి గుర్తింపు ఉంది. ఇక 'బాహుబలి' సినిమాతో రానా క్రేజ్ అన్ని భాషల్లోకి ఎగబాకింది. దాంతో ఆయనతో భారీ సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అలా త్రి భాషా చిత్రంగా రూపొందిన 'అరణ్య' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రానా ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన ఈ సినిమాకి భారీగా పబ్లిసిటీ చేశారు. వసూళ్ల దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రభావం అంతగా ఉన్నట్టుగా అనిపించడం లేదు. ఫలితంగా ఈ సినిమా రాబడుతున్న వసూళ్లు అభిమానులను చాలా నిరాశపరుస్తున్నాయి.

అడవి నేపథ్యంలో .. ఏనుగుల సంరక్షణ ప్రధాన ఉద్దేశంగా ఈ కథ నడుస్తుంది. సాంకేతిక పరంగా కూడా ఈ సినిమా కోసం ఎంత కష్టపడాలో అంతగానూ కష్టపడ్డారు. అయితే హాలీవుడ్ సినిమాలు ఇప్పుడు అందరి అరచేతుల్లో ఉన్నాయి. విజువల్స్ పరంగా అడవి నేపథ్యంలోని సన్నివేశాల విషయంలో, హాలీవుడ్ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టం. ఇక రానా ఆ సినిమా సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 'బాహుబలి'లో కండలు తిరిగిన రానాను చూసిన ప్రేక్షకులు, ఆయన కాస్త బలహీనంగా కనిపించడాన్ని చూడలేకపోయారు. ఈ తరహా కథల్లో రానాను టార్జాన్ గా చూడానికి ప్రేక్షకులు ఇష్టపడతారుగానీ .. ఇలా కాదు.

ఇక అడవి నేపథ్యం అనేది రొమాన్స్ ను అనుకున్న స్థాయిలో పండించడానికి అనువైన ప్రదేశం. హీరో వైపు నుంచి ఆ స్థాయి లవ్ ట్రాక్ ను .. రొమాన్స్ ను ప్రేక్షకులు ఆశిస్తారు. హీరో ఆశయానికి ఎలాంటి అంతరాయం లేకుండానే ఆ ట్రాక్ ను నడిపించవచ్చు. అయితే వాటికి దూరంగా రానా క్యారెక్టర్ ను డిజైన్ చేయడమే మైనస్ గా మారింది. కథలో కామెడీ .. రొమాన్స్ లోపించడం .. ఎంటర్టైన్మెంట్ అంశాలకు రానా పాత్ర దూరంగా ఉండటం .. ఆయన లుక్ నిరాశపరచడంతో పాటు, కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కూడా ఈ సినిమా వసూళ్లు తగ్గడానికి కారణాలుగా చెప్పుకుంటున్నారు.