Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: అటవీ నిర్మూలన - జంతువుల సంరక్షణ గురించి చర్చిస్తున్న 'అరణ్య'
By: Tupaki Desk | 3 March 2021 1:36 PM GMTహ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి నటిస్తున్న తాజా చిత్రం ''అరణ్య''. తెలుగు తమిళ హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ గ్రహీత ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో 2021లో మొదటి త్రిభాషా చిత్రంగా వస్తున్న ''అరణ్య'' థియేట్రికల్ ట్రైలర్ ని నేడు 'వరల్డ్ వైల్డ్ లైఫ్ డే' సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.
'ఏనుగులు మనకన్నా చాలా తెలివైనవి.. వెరీ ఎమోషనల్, సెంటిమెంటల్ అండ్ సో కేరింగ్' అంటూ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైంది. 25 సంవత్సరాలుగా అరణ్యంలో జీవిస్తున్న బల్ దేవ్ అనే వ్యక్తి.. పారిశ్రామికీకరణ పేరుతో అడవులను - ఏనుగులను నిర్మూలించడానికి ప్రభుత్వం మరియు కార్పొరేట్ సంస్థలు చేస్తున్న కుట్రలపై ఎలా పోరాటం చేసాడు అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఏనుగుల సంరక్షణ కోసం పోరాడే జంతు ప్రేమికుడిగా రానా పాత్ర రియలిస్టిక్ గా ఉంది. 'ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం' అంటూ రానా చెప్పే డైలాగ్ అతని పాత్ర స్వభావాన్ని తెలియజేస్తోంది. ఇందులో రానా మేనరిజం మరియు ఆయన హావభావాలు, నడక చాలా కొత్తగా ఉన్నాయి. మరోసారి తన కెరీర్ లో గుర్తిండిపోయే క్యారక్టర్ ప్లే చేసినట్లు తెలుస్తోంది. ఇందులో తమిళ నటుడు విష్ణు విశాల్ - జోయా హుస్సేన్ - శ్రియ పిల్గావోంకర్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. మొత్తం మీద అద్భుతమైన విజువల్స్ తో ఉన్న ఈ యాక్షన్ పాకెడ్ ట్రైలర్ అన్ని వర్గాల వారిని విశేషంగా అలరిస్తోంది.
'త్రీ ఇడియట్స్' 'పీకే' 'పింక్' చిత్రాలకు వర్క్ చేసిన శాంతను మోయిత్ర ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత రసూల్ పోకుట్టి సౌండ్ డిజైన్ చేసారు. ఎ.ఆర్. అశోక్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు. ఈ సినిమా తెలుగులో 'అరణ్య'.. తమిళంలో 'కాదన్'.. హిందీలో 'హాథీ మేరే సాథీ' టైటిల్స్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. పర్యావరణ సమస్యలు - అటవీ నిర్మూలన - జంతువుల సంరక్షణ వంటి అంశాలను చర్చిస్తూ సందేశాత్మకంగా రూపొందించిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.