Begin typing your search above and press return to search.

స్టార్ డం ఫీలవను, బ్యాగులు మోసుకుంటా

By:  Tupaki Desk   |   26 April 2016 7:30 AM GMT
స్టార్ డం ఫీలవను, బ్యాగులు మోసుకుంటా
X
అరవింద్ స్వామి.. ఈ పేరు చెబితే ఓ తరం వెనక కుర్రకారులో వైబ్రేషన్స్ మొదలయ్యేవి. రోజా, బొంబాయి వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా ఆ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ సీనియర్ హీరో. ఇప్పుడు విలన్ గా మారిపోయి.. అందమైన హీరో విలన్ రోల్ చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు. ప్రస్తుతం రామ్ చరణ్ కి విలన్ గా తని ఒరువన్ రీమేక్ చేస్తున్న అరవింద్ స్వామి.. పాతికేళ్ల తర్వాత బాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తూ 'డియర్ డాడ్'లో నటిస్తున్నాడు.

'స్టార్ డం అనేది నాకు ఎలాంటి తృప్తి ఇవ్వదు. జనాలకు నా వర్క్ నచ్చాలని కోరుకుంటాను. అయినా సరే.. ఎప్పుడూ నేను ఓ స్టార్ ని అనే ఫీలింగ్ మనసులోకి రానివ్వలేదు. కనీసం ప్రజలకు నా పేరు తెలియాలని అని కూడా అనుకోను' అంటున్నాడు అరవింద్ స్వామి. సెట్స్ లో కూడా అరవింద్ స్వామి చాలా సింపుల్. ఈయనకు అసిస్టెంట్స్ ఎవరూ ఉండరు. తన బ్యాగ్ లను తనే మోసుకుని వచ్చేస్తుంటాడు కూడా. ఇంతలేసి కెరీర్ - ఇంత గుర్తింపు ఉన్నాక.. ఎవరైనా మీరెవరు అనో, మీ పేరేంటి అని క్వశ్చన్ చేస్తే.. హర్ట్ అవుతారు. కానీ అరవింద్ స్వామి మాత్రం.. నా పేరు తెలీనంత మాత్రాన నేనేం బాధ పడను అంటున్నాడు.

ఈయన కెరీర్ లో దాదాపు 15 ఏళ్ల బ్రేక్ వచ్చింది. 'నిజాయితీగా చెప్పాలంటే ఇంత బ్రేక్ తీసుకుందామని అనుకోలేదు. కొన్నేళ్ల పాటు వేరే ఏదైనా చేద్దామని అనుకున్నా. తర్వాత నా పిల్లలకు సింగిల్ పేరెంట్ గా ఉండాల్సొచ్చింది. ఓ యాక్సిడెంట్ కారణంగా శారీరకంగా చాలానే ఇబ్బందులు ఎదుర్కున్నాను. దీన్నుంచి కోలుకోవడానికి చాలానే టైం పట్టింది. ఇదుగో ఇప్పుడిలా ఉన్నా' అంటున్నాడు అలనాటి అమ్మాయిల కలల హీరో అరవింద్ హీరో.