Begin typing your search above and press return to search.
28 ఏళ్ల పయణం మా ఇద్దరిదీ
By: Tupaki Desk | 25 Sep 2018 12:11 PM GMTధ్రువ సినిమాలో అభిమన్యు పాత్రను తెలుగు ప్రేక్షకులకు అంత తేలిగ్గా మర్చిపోలేరు. అరవింద స్వామి క్లాస్ పెర్ఫామెన్స్ - రామ్ చరణ్ కాంపిటీటివ్ స్పిరిట్ ఆ సినిమా సక్సెస్ కు దోహదం చేశాయి. అంతకుముందే జయం రవి తని ఒరువన్ లోనూ అరవింద స్వామి అంతే గొప్పగా ఆకట్టుకున్నాడు. అందుకే అతడు నటిస్తున్న తాజా చిత్రం నవాబ్ పై భారీ అంచనాలేర్పడ్డాయి. మణిరత్నం ట్రాక్ రికార్డ్ ఏమంత బాగోకపోయినా అరవిందస్వామిపై అభిమానుల నమ్మకమిది. నవాబ్ చిత్రంలో వరద పాత్రలో నటించారాయన. నేడు హైదరాబాద్ లో తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ లో పాల్గొన్న అరవింద స్వామి చాలా సంగతులే తెలిపారు. ముఖ్యంగా తన మెంటార్ మణిరత్న ంతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
నవాబ్ వేడుకలో అరవింద్ స్వామి మాట్లాడుతూ -``రోజాలో `రిషి` - ధ్రువలో `సిద్ధార్థ్ అభిమన్యు పాత్రల్ని తెలుగువారు ఎంతగానో ఆదరించారు. నవాబ్ లోని `వరద` పాత్రను అంతే ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నా ప్రయాణం మణిరత్నం తోనే మొదలు పెట్టాను. సినిమాలకు దూరంగా వెళ్లినా తిరిగి వెనక్కు లాక్కొచ్చారు. దాదాపు 28 ఏళ్ల ప్రయాణం మాది. 8 సినిమాలకు మణి రత్నం గారితో కలిసి పని చేశాను.ఈ సినిమా నాకు తొలి నుంచీ చాలా స్పెషల్. ఆయనతో ప్రతి సినిమా స్పెషల్ గానే ఉంటాయి. కథ వినిపించిన విధానం.. కాస్టింగ్ అన్నీ ప్రత్యేకమే. రెహమాన్ - సంతోష్ వంటి గొప్ప సాంకేతిక నిపుణులతో పనిచేయడం సంతోషంగా ఉంది. అందరికీ నచ్చే చిత్రమిది`` అని తెలిపారు. సీతారామ శాస్త్రి ఈ చిత్రానికి చక్కని సాహిత్యం అందించారని రెహమాన్ ప్రశంసించారు.
అరవింద స్వామి పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఎంతో నవాబ్ తొలి ట్రైలర్ వచ్చినప్పుడే అర్థమైంది. ఇందులో రఫ్ గా కనిపిస్తూనే - రొమాంటిక్ యాంగిల్‌ని చూపిస్తున్నాడు వరదా. ఆ పాత్ర అందరికీ నచ్చుతుందనడంలో సందేహం లేదు. ఒక కుర్చీ కోసం కుటుంబంలోని అన్నదమ్ముల మధ్య సాగే పోరాటంపై ఈ సినిమా కథాంశం ఉంటుందని - కథ ముందే లీకైన సంగతి తెలిసిందే.