Begin typing your search above and press return to search.

'అర‌వింద స‌మేత‌' ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్!

By:  Tupaki Desk   |   17 Sep 2018 7:13 AM GMT
అర‌వింద స‌మేత‌ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్!
X
టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ల కాంబోలో తెర‌కెక్కుతోన్న `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌`చిత్రంపై భారీ అంచ‌నాలున్న సంగ‌తి తెలిసిందే. రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం టీజ‌ర్ లో ఎన్టీఆర్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక తాజాగా విడుద‌లైన లిరిక‌ల్ వీడియో సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఆ చిత్రంలోని మిగ‌తా పాట‌ల కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చిత్ర ఆడియో వేడుక తేదీ వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ చిత్ర ఆడియోను ఈ నెల 20న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

అయితే, ముందుగా అనుకున్న‌ట్లు ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుక ఉండ‌క‌పోవ‌చ్చ‌ని టాలీవుడ్ టాక్. ఈ చిత్ర పాటలను ఈ నెల 20వ తేదీన నేరుగా మార్కెట్ లోకి విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. సెప్టెంబ‌రు 20న ఆడియో రిలీజ్ అని మాత్ర‌మే `హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఓ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు. వేడుక ఉంటుందా...ఉండ‌దా అనే విష‌యంపై స్ప‌ష్ట‌త‌నివ్వ‌లేదు. అయితే, ఈ సినిమాకి సంబంధించి రేపు మరో సర్ ప్రైజ్ ఉండబోతోందంటూ నిర్మాత‌లు ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఈ చిత్రంలో 4 పాటలు మాత్ర‌మే ఉంటాయని టాక్. రెండు డ్యూయెట్స్ .. ఒక సోలో. మరో బ్యాగ్రౌండ్ సాంగ్ ఉంటాయ‌ట‌. ఒక డాక్యుమెంటరీ పనిపై విదేశాల నుంచి రాయ‌ల‌సీమకు వచ్చిన పూజాహెగ్డే .. అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంద‌నే క‌థాంశంతో ఈ సినిమాను తెర‌కెక్కించార‌ట‌. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కానున్న సంగ‌తి తెలిసిందే.