Begin typing your search above and press return to search.

సెలవుల తర్వాత కనిపించని అరవింద జోరు..!

By:  Tupaki Desk   |   24 Oct 2018 6:24 AM GMT
సెలవుల తర్వాత కనిపించని అరవింద జోరు..!
X
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ దసరా కానుకగా ‘అరవింద సమేత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ కెరీర్‌ బెస్ట్‌ చిత్రంగా అరవింద సమేత చిత్రం నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి రోజు కలెక్షన్స్‌ తో నాన్‌ బాహుబలి రికార్డును దక్కించుకున్న ఎన్టీఆర్‌ రెండు వారాల్లో 150 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ ను రాబట్టాడు. దసరా సెలవులు ఆదివారంతో ముగిసిన తర్వాత సోమవారం నుండి అరవింద సమేత కలెక్షన్స్‌ ఎలా ఉంటాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఫ్యాన్స్‌ మరియు సినీ వర్గాల వారు ఆశించినట్లుగా సెలవుల తర్వాత అరవింద సమేత కలెక్షన్స్‌ రావడం లేదని ట్రేడ్‌ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

సోమవారం నుండి ఈ చిత్రం షేర్‌ చాలా తగ్గిందని, మరీ ఇంత తక్కువగా వస్తుందని అనుకోలేదంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. ఒక్కసారిగా షేర్‌ తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్‌ ఈవెన్‌ అయిన దక్కించుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 93 కోట్లకు అమ్ముడు పోయిన ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ దక్కించుకోవాలంటే ఇంకా 7 కోట్ల మేరకు వసూళ్లు చేయాలని సమాచారం. ఇప్పటికే అమెరికాలో బ్రేక్‌ ఈవెన్‌ సాధ్యం కాదని తేలిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల్లో బ్రేక్‌ ఈవెన్‌ చేరగా, మరి కొన్ని ఏరియాల్లో ఇంకా రాబట్టాల్సి ఉంది.

వచ్చే శని, ఆదివారాల్లో ఈ చిత్రం మరోసారి జోరు కొనసాగించే అవకాశం ఉందని ఫ్యాన్స్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు వారాల వరకు పెద్ద సినిమాలు - క్రేజీ మూవీలు ఏమీ కూడా విడుదలకు లేవు. ఆ కారణంగా అరవింద సమేత చిత్రం సందడి కొనసాగుతుందని అనుకున్నారు. కాని వీకెండ్స్‌ లో తప్ప, వీక్‌ డేస్‌ లో మాత్రం ఈ చిత్రం అంతగా జోరు కనబర్చలేక పోతుంది. ఇలాగే కొనసాగితే ఫ్యాన్స్‌ కోరుకున్న 100 కోట్ల షేర్‌ క్లబ్‌ లో ఈ చిత్రం చేరడం అనుమానమే.