Begin typing your search above and press return to search.
రాఘవుడికిది ప్లస్సా మైనస్సా!!
By: Tupaki Desk | 10 Oct 2018 8:17 AM GMTఇప్పుడున్న ఫాస్ట్ యుగంలో సినిమా థియేటర్లో గంటల కొద్ది కూర్చోవాలనుకునే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది. అందుకే దర్శక నిర్మాతలు ఎంత తక్కువ వ్యవధిలో కథను చెప్పగలమా అనే దాని మీదే దృష్టి పెడుతున్నారు. అలా అని లెంగ్త్ ఎక్కువగా ఉన్న వాటికి ఆదరణ ఉండటం లేదనీ కాదు. రంగస్థలం-మహానటి-అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్స్ మూడు గంటల వ్యవధిని టచ్ చేసినవే. అలా అని అన్ని సక్సెస్ అయ్యాయని కాదు. అజ్ఞాతవాసి-నా పేరు సూర్యల ఫెయిల్యూర్ లో డ్యూరేషన్ కూడా శాపంగా మారింది.
ఇప్పుడు అరవింద సమేత వీర రాఘవ రన్ టైం లాక్ అయిపోయింది. 2 గంటల 47 నిమిషాల వ్యవధితో జూనియర్ అలరించనున్నాడు. అంటే ఇంటర్వెల్ బ్రేక్ తో కలిపి థియేటర్ ప్రాంగణంలో మూడు గంటల దాకా సమయం గడపాల్సి ఉంటుంది. త్రివిక్రమ్ సినిమాలు ఏవి తీసుకున్నా అన్ని దాదాపు ఇవే లెంగ్త్ తో ఉంటాయి. ఆయన ఎన్నడూ రాజీ పడిన దాఖలాలు లేవు. అంత దాకా ఎందుకు మొదటి సినిమా ఫామిలీ లవ్ ఎంటర్ టైనర్ నువ్వే నువ్వే సైతం రెండు ముప్పాతిక గంటలు ఉంటుంది.
అందుకే అరవింద సమేత వీర రాఘవ రన్ టైం గురించిన చర్చ ఆసక్తికరంగా మారింది. లెంగ్త్ ఎంత ఉన్నా కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఎలాగూ ఫ్యాక్షన్ తో పాటు ఎమోషన్ ఫుల్ గా ఉన్న మూవీగా దీని మీద మంచి అంచనాలు ఉన్నాయి. అవి నిలబెట్టుకుంటే ఇదేమి సమస్య కాదు. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే వీకెండ్ మొత్తాన్ని తారక్ ఆక్రమించుకున్నట్టుగా ట్రేడ్ రిపోర్ట్స్ ఉన్నాయి. తమన్ మ్యూజిక్ తో పూజా హెగ్డే అందాలు ఆకర్షణగా నిలవనున్న ఈ మూవీ మీద వంద కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ రిపోర్ట్.