Begin typing your search above and press return to search.

అరవింద అరాచకం మొదలైందిగా!!

By:  Tupaki Desk   |   9 Oct 2018 4:17 AM GMT
అరవింద అరాచకం మొదలైందిగా!!
X
ఇంకో 48 గంటల్లోపే యంగ్ టైగర్ విశ్వరూపంగా అభిమానులు ఆశిస్తున్న అరవింద సమేత వీర రాఘవ ప్రీమియర్ షోలు మొదలుకాబోతున్నాయి. అసలే బాక్స్ ఆఫీస్ చాలా కాలంగా స్తబ్దుగా ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఏ హీరో సినిమా గొప్ప ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. నిఖార్సైన బ్లాక్ బస్టర్ గా నిలిచి బయ్యర్లను లాభాల్లో ముంచెత్తిన భారీ బడ్జెట్ సినిమా వచ్చి నెలలు అవుతోంది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలే కొంత నయం అనిపించాయి. అందుకే ఈ మూవీ మీద హైప్ మాములుగా లేదు. గురువారమే విడుదల అవుతున్న దృష్ట్యా ఓపెనింగ్స్ విషయంలో తారక్ తన సత్తా చాటుతాడని ట్రేడ్ సైతం భారీ పెట్టుబడులకు వెనుకాడలేదు.

మొదటి ఆటకు బాగుంది అని టాక్ వస్తే చాలు బాక్స్ ఆఫీస్ ని దున్నడం ఖాయమననే నమ్మకంతో ఉంది. ఆ ట్రెండ్ ఇప్పుడు అడ్వాన్సు బుకింగ్ రూపంలో కనిపిస్తోంది. హైదరాబాద్ సహా కీలక నగరాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆన్ లైన్ బుకింగ్ ని గమనిస్తే ఆదివారం దాకా దాదాపు అన్ని ఫుల్స్ కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. త్రివిక్రమ్ బ్రాండ్ తో పాటు జూనియర్ ఫస్ట్ టైం కాంబో కాబట్టి ఆ రకంగానూ హైప్ పెరగడానికి కారణం అవుతోంది.

రేపటి నుంచి అధిక శాతం స్కూళ్ళకు దసరా సెలవులు ప్రారంభం కాబోతున్నాయి. అది కలిసి వచ్చే అంశమే. దానికి తోడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రోజుకు రెండు అదనపు షోలకు అనుమతి ఇవ్వడం ఇంకా పెద్ద ప్లస్ కానుంది. ఈ నేపధ్యంలో అరవింద సమేత వీర రాఘవకు ఇవన్ని అనుకూలాంశాలుగా మారబోతున్నాయి. పోస్టర్లు వీడియో ప్రోమోలు అభిమానుల్లో ఇప్పటికే జోష్ ని నింపుతున్నాయి. ఈ రోజు రెడ్డి ఇటు చూడు ప్రోమోని కూడా విడుదల చేయబోతున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సీమలో హింసను ఆపేవాడే మగాడు అనే కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ మూవీలో మాస్ కు గూస్ బంప్స్ ఇచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు హృదయాన్ని తడిమే ఎమోషన్ త్రివిక్రమ్ అద్భుతంగా తెరకెక్కించాడన్న టాక్ ఇప్పటికే అంచనాలను పెంచేస్తోంది.

తెల్లవారుఝామున 4.50 నిమిషాలకు ప్రీమియర్ షో ముహుర్తంగా డిసైడ్ చేసినట్టు ఇన్ సైడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో మొదటి షో అన్నిచోట్లా అదే సమయానికి ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. సో అరవింద సమేతంగా వీర రాఘవ రెడ్డి చేయబోయే రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాలి అంతే.