Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : 'అరవింద సమేత'
By: Tupaki Desk | 11 Oct 2018 9:41 AM GMTచిత్రం : 'అరవింద సమేత వీర రాఘవ'
నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్ - పూజా హెగ్డే - జగపతిబాబు - నాగబాబు - సునీల్ - రావు రమేష్ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్
నిర్మాత: ఎస్.వినోద్
రచన - దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
ఈ ఏడాది ద్వితీయార్దంలో అతి పెద్ద తెలుగు సినిమా ‘అరవింద సమేత’. జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ అంచనాల్ని ఈ చిత్రం ఏ మేరకు అందుకుందో చూద్దాం పదండి.
కథ:
రాయలసీమ ప్రాంతంలోని ఫ్యాక్షన్ నాయకుడైన నారప్పరెడ్డి (నాగబాబు) కొడుకు వీర రాఘవ రెడ్డి (జూనియర్ ఎన్టీఆర్). వీళ్ల కుటుంబానికి బసిరెడ్డి (జగపతిబాబు) కుటుంబానికి దశాబ్దాలుగా ఫ్యాక్షన్ గొడవలుంటాయి. దీని వల్ల చుట్టు పక్కల 20 ఊళ్లలో ప్రజలు అవస్థలు పడుతుంటారు. ఐతే తన తండ్రిని శత్రువులు తన కళ్ల ముందే చంపేయడంతో రాఘవరెడ్డి కూడా ఉగ్రరూపం దాలుస్తాడు. శత్రువుల మీద కత్తి దూస్తాడు. కానీ ఇంటికొచ్చాక తన నాయనమ్మ చెప్పిన మాటలతో అతడిలో మార్పు వస్తుంది. తర్వాత రాఘవ ఈ గొడవలకు దూరంగా ఉందామని సిటీకి వెళ్తే.. అక్కడ అనుకోకుండా పరిచయమైన అరవింద (పూజా హెగ్డే) మాటలతో అతడిలో మరింత మార్పు వస్తుంది. మొత్తంగా ఫ్యాక్షనిజం రూపుమాపడానికి కంకణం కట్టుకుంటాడు. మరి అందుకోసం అతనేం చేశాడు.. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి.. చివరికి అతడి లక్ష్యం నెరవేరిందా లేదా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
ఒక పెద్ద దర్శకుడు.. ఒక పెద్ద హీరో కలవగానే కమర్షియల్ హంగుల పేరుతో అవసరం లేని మసాలాల మీద దృష్టి పెట్టేవారు ఒకప్పుడు. ఈ క్రమంలో కథ పలుచన అయిపోయేది. ప్రేక్షకులకు ఇదే కావాలని చాలా ఏళ్ల పాటు అలాగే వడ్డిస్తూ వచ్చారు. కానీ గత కొన్నేళ్లలో ఇటు ఫిలిం మేకర్స్.. అటు ప్రేక్షకులు ఇద్దరూ మారారు. ఈ క్రమంలో ఇమేజ్ లు.. కమర్షియల్ హంగులు అన్నీ పక్కకు పోయి కథలు చెప్పడం మొదలైంది. ఏమైనా మసాలాలు అద్దినా అవి కథలో భాగంగానే ఉంటున్నాయి. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి పెద్ద యాక్షన్ ఎపిసోడే అవసరం లేదు.. మంచి ఎమోషన్ ఉన్న సీన్ అయినా చాలని చాలా సినిమాలు రుజువు చేశాయి. కొన్ని నెలల కిందటే ‘రంగస్థలం’లో సుకుమార్.. రామ్ చరణ్ ను ముందు పెట్టి నిజాయితీగా ఒక కథ చెబితే దాన్ని గొప్పగా ఆదరించారు ప్రేక్షకులు. ఇప్పుడు త్రివిక్రమ్ తన శైలికి భిన్నంగా ఒక కథను ఎంచుకుని నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక ఈ కథను మరో స్థాయికి తీసుకెళ్లడానికి ఎన్టీఆర్ రూపంలో అతడికి గొప్ప ‘నటుడు’ కూడా దొరికాడు. కానీ కేవలం కథ చెబితే సరిపోతుందా.. తన మార్కు వినోదం లేకపోతే ఎలా అని మధ్యలో సందేహం కలిగిందేమో.. మధ్యలో తన పాత స్టయిల్లో ఒక రొమాంటిక్ ట్రాక్ తెచ్చి పెట్టాడు. అది కాస్తా సినిమాకు పెద్ద అడ్డంకిగా మారింది. సినిమాలో వినోదం లేకపోవడం మైనస్ అయితే.. వినోదం కోసం తెచ్చిపెట్టిన ఈ ట్రాక్ కథాగమనానికి అడ్డం పడుతుంది. దీన్ని మినహాయిస్తే త్రివిక్రమ్-ఎన్టీఆర్ జోడీ పెట్టిన సిన్సియర్ ఎఫర్ట్ చాలా వరకు ఫలించింది.
‘అరవింద సమేత’ మనకు తెలిసిన కథనే ఇంకాస్త లోతుగా.. బలంగా చెబుతుంది. ఇన్నేళ్లుగా చూస్తూ వచ్చిన ఫ్యాక్షన్ కథల్లో మరుగున పడిపోయిన అంశాల్ని హైలైట్ చేస్తుంది. ఇప్పటిదాకా మనం తెలుగులో ఫ్యాక్షన్ కథలు చాలా వచ్చాయి. ఐతే వాటిలో సినిమా అంతటా హింస చూపించి.. చివర్లో శాంతి వచనాలు పలికేసి కథల్ని ముగించేయడమే ఎక్కువగా చూశాం. ఐతే ‘మిర్చి’లో కొరటాల శివ ఇంకొంచెం ముందుకెళ్లి యుద్ధాన్ని ఆపడానికి హీరో చేసే ఒక ప్రయత్నాన్ని ప్రభావవంతంగా చూపించాడు. ‘అరవింద సమేత’లో త్రివిక్రమ్ ఇంకా ముందుకు వెళ్లాడు. యుద్ధం పర్యవసనాల్ని.. యుద్ధం అనంతరం జీవితాల్ని కొంచెం లోతుగా తడిమే ప్రయత్నం చేశాడు. ఈ విషయాల్ని ఎఫెక్టివ్ గా చెప్పడంలో అతను విజయవంతమయ్యాడు. ఇక అన్నింటికీ మించి ఇప్పటిదాకా చూసిన ఫ్యాక్షన్ కథలతో పోలిస్తే.. ఇక్కడ చాలా ప్రత్యేకంగా కనిపించే విషయం.. రాయలసీమ నేపథ్యాన్ని చాలా వాస్తవికంగా చూపించడం. ఫ్యాక్షన్ పల్లెల్ని.. అక్కడి గొడవల్ని.. మనుషుల్ని.. వాళ్ల భాషను.. యాసను.. ఇంత అథెంటిగ్గా.. ఇంత ప్రభావవంతంగా తెరమీదికి తెచ్చిన సినిమాలు అరుదు. ఈ విషయంలో త్రివిక్రమ్ బృందం చేసిన కృషికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
మామూలుగా ఏ ఇంటర్వెల్ ఎపిసోడ్ గానో.. లేదంటే క్లైమాక్సుగానో ఉండాల్సిన భారీ యాక్షన్ ఘట్టాన్ని సినిమా ఆరంభంలోనే చూపించాడు త్రివిక్రమ్. తాను చెప్పాలనుకున్నది యుద్ధం గురించిన కథ కాదు. యుద్ధం అనంతరం జరిగే కథను. అందుకే మొదట్లోనే ఆ ఎపిసోడ్ పెట్టేశాడేమో. సీమ నేపథ్యంలో సినిమాకే మేజర్ హైలైట్ గా నిలిచే ఆరంభ ఎపిసోడ్లో కొత్త త్రివిక్రమ్ కనిపిస్తాడు. కానీ కథ సిటీకి మారిన కొద్దిసేపటికే సినిమా చాలా సాధారణంగా మారిపోతుంది. రొమాంటిక్ ట్రాక్ నిస్సారంగా సాగి మొదట్లో కలిగిన మంచి ఫీలింగ్ ను చెడగొట్టేస్తుంది. ‘అరవింద సమేత..’ అనే టైటిల్ కు న్యాయం చేయడం కోసమో ఏమో.. హీరోయిన్ పాత్రను ఒక ఉత్ప్రేరకంగా చూపించాలని చూశాడు కానీ.. ఆ పాత్ర ఎక్కడా అంత ఎఫెక్టివ్ గా లేకపోయింది. సిల్లీగా సాగే ఆ పాత్ర కథలోని ఇంటెన్సిటీని తగ్గించేస్తుంది.
ఐతే ఈ ట్రాక్ ముగిసి.. మళ్లీ అసలు కథలోకి వెళ్లాక త్రివిక్రమ్ మళ్లీ ఫామ్ అందుకున్నాడు. ఇంటర్వెల్ బ్యాంగ్.. ద్వితీయార్ధంలో కథే ప్రధానంగా ఎమోషనల్ గా సాగే ఎపిసోడ్లు.. ప్రభావవంతంగా రూపొందాయి. ముఖ్యంగా ఎన్టీఆర్-నవీన్ చంద్ర మధ్య సాగే ‘రాజీ’ ఎపిసోడ్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందులో ఎన్టీఆర్ అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. రచయితగా త్రివిక్రమ్ బలం కూడా ఈ సీన్లో కనిపిస్తుంది. ప్రి క్లైమాక్స్.. క్లైమాక్స్ లను కూడా బలంగానే తీర్చిదిద్దాడు త్రివిక్రమ్. ఇక్కడ జగపతిబాబు కూడా బాగా అందుకున్నాడు. ముగింపు ఊహించిందే అయినప్పటికీ తాను చెప్పాలనుకున్న విషయాన్ని బాగానే చెప్పగలిగాడు త్రివిక్రమ్. ద్వితీయార్ధంలో తమన్ నేపథ్య సంగీతం కూడా ఇంటెన్స్ గా సాగి కథకు కీలకమైన ఎపిసోడ్లు బాగా పండాయి. ప్రథమార్ధం కూడా ఇంతే ఇంటెన్స్ గా ఉండి ఉంటే ‘అరవింద సమేత’ మరో స్థాయిలో ఉండేది. కథలో కొత్తదనం ఏమీ కనిపించదు. ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టిన రొమాంటిక్ ట్రాక్ మాత్రం సినిమా గ్రాఫ్ ను తగ్గించేస్తుంది. త్రివిక్రమ్ నుంచి మామూలుగా ప్రేక్షకులు ఆశించే వినోదమైతే ఇందులో లేదు. అది నిరాశ కలిగించే విషయమే అయినా.. దాన్ని దాటి ప్రేక్షకుల్ని మెప్పించే అంశాలు ఇందులో ఉన్నాయి.
నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్లో మరో గుర్తుండిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చాడు ‘అరవింద సమేత’లో. అతడి నట కౌశలాన్ని చూపించే చాలా సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి. అతడి నటనలో ఎంత పరిణతి వచ్చిందో ఈ సినిమా మరోసారి రుజువు చేస్తుంది. ఫ్యాక్షన్ నేపథ్యంలోనే వచ్చిన ‘ఆది’.. ‘సాంబ’ లాంటి సినిమాల్ని ఒకసారి గుర్తు చేసుకుని.. ఇప్పుడీ సినిమా చూస్తుంటే ఎన్టీఆర్ నటుడిగా ఎంత ఎదిగాడో.. ఇప్పటి ప్రేక్షకుల అభిరుచిని ఎంతగా అర్థం చేసుకున్నాడో తెలుస్తుంది. సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎంత పరిణతితో వ్యవహరిస్తుందో.. అతడి నటన కూడా అందుకు తగ్గట్లే ఉంటుంది. కేవలం మాటలతో ప్రత్యర్థుల్ని భయపెట్టే సన్నివేశం.. యుద్ధం ముగించి నీ దగ్గరికి వస్తా అంటూ కథానాయికతో చెప్పే సన్నివేశం... ‘రాజీ’ సీన్.. ఇలా ఎన్టీఆర్ నట కౌశలాన్ని చూపించే చాలా సన్నివేశాలున్నాయిందులో. ఒకచోట అతడిని ‘టార్చ్ బేరర్’ అంటూ పొగుడుతాడు రావు రమేష్. ఈ సినిమా విషయంలో అతడికి ఆ మాట సరిగ్గా సరిపోతుంది. తారక్ తర్వాత నటన పరంగా ప్రత్యేకంగా నిలిచేది జగపతిబాబు. ఆయనకు కూడా కెరీర్లో ఇది మరో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది. ఆయన గెటప్.. బాడీ లాంగ్వేజ్.. డబ్బింగ్ అన్నీ కూడా గొప్పగా కుదిరాయి. ప్రేక్షకులపై బలమైన ముద్ర వేస్తుందీ పాత్ర. నవీన్ చంద్ర కూడా చాలా బాగా చేశాడు. తక్కువ సన్నివేశాల్లోనే తన ప్రత్యేకత చాటుకున్నాడు. హీరోయిన్ పూజా హెగ్డే పాత్ర అనుకున్న స్థాయిలో పండలేదు. ఆమె తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. నటన పర్వాలేదు. బ్రహ్మాజీ.. శత్రు మెరిశారు. మిగతా వాళ్లంతా ఓకే.
సాంకేతిక వర్గం:
తమన్ పాటలు ఓకే. ‘పెనివిటి’.. ‘అనగనగనగా..’ పాటు వినడానికి బాగున్నా చిత్రీకరణ ఆకట్టుకోలేదు. పాటల పరంగా సినిమాలో నిరాశ తప్పదు. కానీ నేపథ్య సంగీతంతో హీరోగా నిలిచాడు తమన్. సినిమాలో కీలకమైన ఘట్టాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఆ విషయంలో సినిమాకు పెద్ద బలంగా నిలిచాడు తమన్. పి.ఎస్.వినోద్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. సీమ నేపథ్యాన్ని చాలా బాగా చూపించాడు. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ ‘అరవింద సమేత’లో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశాడు. మామూలుగా త్రివిక్రమ్ వినోదాత్మక సన్నివేశాల మీద బండి లాగించేస్తుంటాడు. కానీ ఇందులో మాత్రం ఒక సీరియస్ కథను బలంగా చెప్పే ప్రయత్నం చేశాడు. కథ తెలిసిందే అయినప్పటికీ.. రాయలసీమ నేపథ్యాన్ని అథెంటిగ్గా చూపించడం ద్వారా దీనికి ప్రత్యేకత చేకూర్చాడు. ప్రథమార్ధం.. ముఖ్యంగా సిటీ నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో మాత్రం త్రివిక్రమ్ సాధారణంగా కనిపించాడు. మిగతా చోట్లంతా ఆయనలోని రచయిత.. దర్శకుడు ప్రత్యేకత చాటుకున్నారు. త్రివిక్రమ్ స్థాయిని తెలియజెప్పే మాటలు ఇందులో చాలా ఉన్నాయి.
చివరగా: అరవింద సమేత.. పాత కథలో ఎన్టీఆర్ సవారీ
రేటింగ్-3/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre