Begin typing your search above and press return to search.

'అరవింద సమేత' రన్ టైం ఎంత?

By:  Tupaki Desk   |   8 Oct 2018 5:32 PM GMT
అరవింద సమేత రన్ టైం ఎంత?
X
తెలుగు సినిమాల నిడివి విషయంలో రూల్స్ బ్రేక్ అయిపోయాయి ఈ మధ్య. రెండు-రెండున్నర గంటల మధ్యే ఉంటున్న నిడివి ఈ మధ్య పెరుగుతోంది. మూడు గంటల సినిమాలు కూడా చాలా బాగా ఆడేస్తుండటంతో పాత రోజుల్లోకి వెళ్లిపోయి లెంగ్తీ సినిమాల్ని వదిలేస్తున్నారు ఫిలిం మేకర్స్. గత ఏడాది ‘అర్జున్ రెడ్డి’ 3 గంటలకు పైగా నిడివితో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ‘రంగస్థలం’ సైతం మూడు గంటల ఫైనల్ కట్‌ తోనే ప్రేక్షకుల ముందుకొచ్చి ఆదరణ పొందింది. ‘భరత్ అనే నేను’ సైతం దాదాపు మూడు గంటల నిడివి ఉన్నదే. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘అరవింద సమేత’ను కొంచెం ఎక్కువ నిడివితో వదిలేస్తున్నారు.

ఈ రోజే ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. దీని నిడివి 2 గంటల 41 నిమిషాల 30 సెకన్లని వెల్లడైంది. అంటే 11న జనాలు కొంచెం పెద్ద సినిమానే చూడబోతున్నారన్నమాట. మిగతా దర్శకులు నిడివి తగ్గిస్తున్నప్పటికీ త్రివిక్రమ్ మాత్రం ఎప్పుడూ కొంచెం లెంగ్త్ ఎక్కువన్న సినిమాలే తీస్తూ వస్తున్నాడు. అతడి చివరి సినిమా ‘అజ్నాతవాసి’ నిడివి కూడా దాదాపు 2 గంటల 40 నిమిషాలుంటుంది. ఐతే ‘అరవింద సమేత’ ద్వితీయార్ధం కొంచెం నెమ్మదిగా సాగుతుందని అంటున్న నేపథ్యంలో నిడివి సమస్య అవుతుందేమో చూడాలి. కానీ ప్రేక్షకులు కనెక్టయితే.. ఎమోషన్లు బాగా పండితే లెంగ్త్ పెద్ద సమస్య కాకపోవచ్చు. ఇక ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు అనుకున్నట్లే యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది.