Begin typing your search above and press return to search.
వన్ మ్యాన్ షో ఇది
By: Tupaki Desk | 11 Oct 2018 1:06 PM GMTఎన్టీఆర్ తన కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడంటూ ఒకటే ప్రచారం సాగుతోంది. `అరవింద సమేత` బిగ్ హిట్ అంటూ చిత్రయూనిట్ సైతం అప్పుడే మీడియా ముందుకు వచ్చేసింది. రిలీజ్ డే ఇలా సక్సెస్ మీట్ తో ఒకే వేదికపైకి చిత్రయూనిట్ బరిలోకి రావడం ఈ సందర్భంగా చర్చకొచ్చింది.
దిల్ రాజు మాట్లాడుతూ -``ఎన్టీఆర్ కెరీర్ హైయ్యస్ట్ గ్రాస్ చేస్తున్న సినిమా ఇది. మాటల మాంత్రికుడు మాయ చేశాడు. ఇంద్ర యాక్షన్ బ్యాక్ డ్రాప్ చిత్రం. ఆది - సమర సింహారెడ్డి - నరసింహా నాయుడు .. ఇలా ఎన్నో ఫ్యాక్షన్ సినిమాలు చూశాం. ఫ్యాక్షన్ కథని త్రివిక్రమ్ అంత గొప్పగా చూపించారు. నటుడిగా ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో చూపించారు. జగపతిబాబు నటన అద్భుతం. సినీపరిశ్రమ వెయిటింగ్ లో ఉంది మంచి హిట్టు కావాలని. రెండు నెలలుగా మంచి సినిమా రాలేదు. ఒక మంచి సినిమా ఇచ్చినందుకు త్రివిక్రమ్ కు థాంక్స్`` అన్నారు.
సునీల్ మాట్లాడుతూ - ``చాలా హ్యాపీగా ఉన్నాను. అయితే కొందరు మాత్రం నా పాత్ర మరీ ఎక్కువ లేదేంటి? అని అడిగారు. ఇందులో ఎంత అవసరమో అంతే నేను కనిపించాను. నేను నటించిన సీన్లు కట్ చేసినా.. అవసరం అయిన కామెడీ సీన్లే ఉంచారు. యాక్షన్ - ఫ్యాక్షన్ సినిమాని ఫ్యామిలీ సినిమాని చేశాడు త్రివిక్రమ్. ఫ్యాక్షన్ సినిమాల్లో మంచి క్లాసిక్‌ని ఇచ్చాడు. అందులో నాకు ఛాన్సిచ్చినందుకు థాంక్స్`` అన్నారు. వేదిక ఆద్యంతం చిత్రయూనిట్ ఎంతో ఉత్సాహంగా కనిపించడం చూస్తుంటే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడమే కారణమని భావించవచ్చు. అయితే ఈ సినిమాపై కొన్నిచోట్ల మిశ్రమ స్పందన లు వస్తున్నాయి. అమెరికాలో 1మిలియన్ డాలర్ క్లబ్ అన్న మాట వినిపించడం ప్లస్ అనే చెప్పాలి.