Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ : ఘాటు మోటు ఎఫైర్
By: Tupaki Desk | 5 Nov 2018 6:18 AM GMTఆయన వెంటే ఆవిడ. ఆవిడ వెంటే ఆయన! ముంబై నగరంలో ఎక్కడ ఏ పార్టీ జరిగినా - ఏ క్లబ్బు పబ్బు వెతికినా.. ఏ రెస్టారెంట్ పార్టీ చూసినా అక్కడ ఆ జంట వాలిపోతున్నారు. గత కొంతకాలంగా తమపై బాలీవుడ్ మీడియా ప్రత్యేకించి ఫోకస్ పెట్టినా - అదేమీ పట్టనట్టు ఓపెన్ గానే షికార్లు చేస్తున్నారు. ఆ జంట ఎవరో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే భార్య మలైకాకు విడాకులిచ్చిన ఆర్భాజ్ ఖాన్ .. తన కొత్త గాళ్ ఫ్రెండ్ తో ఏమాత్రం బిడియం లేకుండా బహిరంగంగా షికార్లు చేయడం సర్వత్రా చర్చకొచ్చింది.
ఆర్భాజ్ సదరు అందగత్తెకు తన రేంజు రోవర్ లో.. బాంద్రా సొంత ఇంటి బాల్కనీలో.. హృదయంలోనే చోటిచ్చినప్పుడు ఇక పార్టీలు - పబ్బుల్లో కలిసి తిరిగేస్తే తప్పేంటి? అన్న మాటా వినిపిస్తోంది. తాను ఏ ఫిలాసఫీని నమ్మితే అదే ఫాలో అయిపోతున్నాడు ఆర్భాజ్. తాజాగా ముంబైలో దీపావళి సందడి మామూలుగా లేదు. సెలబ్రిటీల ఇంట పార్టీలతో హోరెత్తిపోతోంది. ఆ క్రమంలోనే ఎవరు పార్టీకి పిలిచినా ఆర్భాజ్ కొత్త గాళ్ ఫ్రెండ్ జార్జ్ ఆండ్రియానీతో దిగిపోతున్నాడు. రేంజ్ రోవర్ ఎం.హెచ్ 02.బియు 6000 నంబర్ బండిలో దిగి చెలికత్తె చెయ్యి అందుకుని మరీ లోనికి తీసుకెళుతున్నాడు.
ప్రస్తుతం ఆ ఫోటోలు వెబ్ ని ఠారెత్తిస్తున్నాయి. ఎవరీ అందగత్తె..? ఇంతలోనే ఎంతటి పాపులారిటీ అని కుళ్లుకునేవాళ్లు ఉన్నారు. అయితే బాలీవుడ్ లో ఇవన్నీ మామూలే. అక్కడ రిలేషన్ షిప్స్ ఆయారాం..గయారాం తరహానే అన్న విరుపు మాటలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే దేనినీ లెక్క చేయక ఆర్భాజ్ తన చెలికత్తెతో ఇలా హాయిగా షికార్లు చేస్తూనే ఉన్నాడు. పొడుగు కాళ్ల సుందరి శిల్పాశెట్టి ఇచ్చిన దీవాళి పార్టీకి ఆర్భాజ్ తన డార్లింగ్ ఆండ్రియానీతో దిగిపోయాడు. ఆసక్తికరంగా భాయ్ సల్మాన్ అప్పుడే లోనికెళ్లాడు. ఆ వెంటనే ఈ జంట దిగిపోయింది అక్కడ. బాప్ రే ఆర్భాజ్..