Begin typing your search above and press return to search.

విడిపోయినా అత్త గారికి ఎంత మర్యాదో

By:  Tupaki Desk   |   3 March 2017 12:06 PM GMT
విడిపోయినా అత్త గారికి ఎంత మర్యాదో
X
తాజాగా కిట్టు ఉన్నాడు జాగ్రత్త మూవీలో నటించిన బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్.. గతంలో జై చిరంజీవ మూవీతో టాలీవుడ్ కి దగ్గరయ్యాడు. మళ్లీ ఇన్నేళ్లకు ఆకట్టుకునే పాత్ర దక్కడంతో నటించాడు. ఇప్పుడు కూడా విలన్ గానే కనిపించాడు లెండి.

పర్సనల్ విషయాలు చూస్తే అర్బాజ్ ఖాన్ తన భార్య మలైకా అరోరా(కెవ్వు కేక బ్యూటీ)తో విడాకులకు అప్లై చేశాడు. డిసెంబర్ లో విడాకులకు దరఖాస్తు చేయగా.. మే నెలలో వీరికి విడాకులు మంజూరయ్యే అవకాశం ఉంది. అయితే.. మలైకాతో విడిపోతున్నా.. అర్బాజ్ ఖాన్ మాత్రం తన అత్తగారికి ఇచ్చే విలువలో ఇసుమంత కూడా తగ్గించుకోకపోవడం విశేషం. తాజాగా మలైకా తల్లి జాయ్ సే పోలీకార్ప్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. సన్నిహితులు అందరితో పాటు అర్బాజ్ కు కూడా ఆహ్వానం పంపగా.. ఏ మాత్రం భేషజాలు చూపకుండా.. ఈ వేడుకలకు హాజరయ్యాడు అర్బాజ్ ఖాన్.

అంతే కాదు.. ఆ వేడుకలో ఆమె పట్ల అర్బాజ్ ఎంత గౌరవం చూపాడో అని చెప్పుకుంటున్నారు చాలామంది. ఈ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు కూడా ఇదే విషయాన్ని చాటి చెబుతున్నాయి. సినిమాల్లో విలన్ అయినా.. రియల్ లైఫ్ లో మాత్రం తనదైన శైలితో హీరో అనిపించుకున్నాడు అర్బాజ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/