Begin typing your search above and press return to search.
మొగుడితో కలసి టివిలో కెవ్వు కేక
By: Tupaki Desk | 2 Oct 2015 1:30 PM GMTకెవ్వు కేక అంటూ గబ్బర్ సింగ్ లో ఆడిపాడింది మలైకా అరోరాఖాన్. ఆ ఐటెమ్ నంబర్ తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించిందే లేదు. అయితే బాలీవుడ్‌లో మాత్రం ఎప్పటికప్పుడు ఐటెమ్ నంబర్లు చేస్తూ కాలక్షేపం చేస్తోంది. ఇటీవలే ఈ అమ్మడు తన స్నేహితురాళ్లతో కలిసి విదేశీ విహారంలో ఓ రేంజులో ఎంజాయ్ చేసి వచ్చింది. ఇలా వస్తూనే అలా తీపికబురు ఒకటి వినిపించింది.
మలైకా తన భర్త ఆర్భాజ్ ఖాన్ సారథ్యంలో ఓ రియాలిటీ షోలో పాల్గొంటోంది. భార్యా భర్తల అనుబంధానికి సంబంధించిన షో ఇది. ఇందులో 10 జంటలు షోలో పాల్గొంటాయి. భార్య - భర్తలు ఒకరినొకరు ఎంతవరకూ అర్థం చేసుకుంటున్నారు? అన్నదే కాన్సెప్ట్. ఈ రియాలిటీ షోని ఆర్భాజ్ స్వయంగా నిర్మిస్తున్నారు. పవర్ కపుల్ అనే టైటిల్ తో ఈ షో ప్రముఖ టీవీ చానెల్ సోనీలో ప్రసారం అవుతుందని సమాచారం. అయితే ఈ రియాలిటీ షోకి ఇన్ స్పిరేషన్ ఉంది. ఇజ్రాయెల్ లో ఇప్పటికే ఇది పాపులర్ షో . ఇప్పుడు దానికి హిందీ వెర్షన్ వంటకానికి రెడీ అవుతున్నారు. మలైకా - ఆర్భాజ్ ఎంటర్ టైన్ మెంట్ రంగంలో బుల్లితెరపై బోలెడన్ని కార్యక్రమాల్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఇలాంటి కాపీ షోలతో ఇండియన్ టెలివిజన్ పై కనిపించాలనుకోవడం ఏంటో? అయినా భార్యా భర్తల్లోని ఒరిజినల్ ప్రేమల్ని తెరపై చూపించేస్తే.. దేశంలోని కాపురాలు కుప్పకూలవూ? మన కల్చర్‌లో కలకలం చెలరేగకుండా ఆపగలమా?