Begin typing your search above and press return to search.

విడిపోయినా.. ఇలా కలుసుకుంటున్నారు

By:  Tupaki Desk   |   10 Nov 2017 5:30 PM GMT
విడిపోయినా.. ఇలా కలుసుకుంటున్నారు
X
సినీ ఇండస్ట్రీలలో ఉండే మాయ ఏమిటో గాని తారలు చాలావరకు సిల్వర్ స్క్రీన్ పై ఉన్నట్టు అస్సలు ఉండరు. తెరపై వారి మంచితనం లైఫ్ స్టైల్ ని చూస్తుంటే నిజ జీవితంలో కూడా అలానే ఉంటారేమో అన్నంత రేంజ్ లో నటిస్తారు. కానీ వెండితెర వెనుక మాత్రం మనం ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా దాంపత్య విషయంలో కొందరు తారలు ఎంతో అన్యోన్యతతో ఉంటే మరి కొందరు అర్థం లేని గోడవలతో దూరం అవుతుంటారు.

అయితే మళ్లీ అనుకోకుండా కలిసినప్పుడు మాత్రం చాలా కూల్ గా మాట్లాడుకుంటారు. అంతే కాకుండా జీవితంలో వారి ప్రేమకు గుర్తుగా జన్మించిన పిల్లల కోసం కుడా అప్పుడప్పుడు కలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. రీసెంట్ గా ఇటీవల బాలీవుడ్ లో కొందరు సెలబ్రెటీలు వారి పిల్లల కోసం గతాన్ని పక్కన పెట్టి హ్యాపీగా గడిపారు. మలైకా అరోరా - ఆర్బాజ్ ఖాన్ విడిపోయి చాలా కాలమే అవుతోంది. కానీ వారి కొడుకు పుట్టిన రోజును మాత్రం ఇద్దరు కలిసి జరుపుకున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం వీరిద్దరూ వేరేవాళ్లతో డేటింగ్ చేస్తున్నారు.

అలాగే హృతిక్ - సుజానే కూడా ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నేళ్ల వరకు బాగానే ఉన్నారు. కానీ విబేధాలతో విడాకులు తీసుకున్న వారి పిల్లల కోసం అప్పుడప్పుడు తల్లిదండ్రుల బాధ్యతను కరెక్ట్ గా నిర్వర్తిస్తున్నారు. ఇటీవల పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్లి విహార యాత్రలు చేసి వచ్చారు. అంతే కాకుండా సల్మాన్ ఇచ్చిన ఓ పార్టీలో వీరిద్దరూ కలిసి స్టెప్పులు కూడా వేశారు. ఇలాంటి దంపతులు సౌత్ ఇండస్ట్రీలో. లోను ఉన్నారు. మొత్తానికి విడిపోయినా కూడా వారి ఈగో లను పక్కనపెట్టి కనీసం పిల్లల కోసం కలుసుకుంటున్నారు అంటే వీరిని అభినందించాల్సిందే.