Begin typing your search above and press return to search.

విడాకుల‌కు ఆ ‌హీరో కార‌ణ‌మా? ప‌్ర‌శ్నించిన జ‌ర్నోపై పంచ్!

By:  Tupaki Desk   |   24 April 2020 2:30 AM GMT
విడాకుల‌కు ఆ ‌హీరో కార‌ణ‌మా? ప‌్ర‌శ్నించిన జ‌ర్నోపై పంచ్!
X
మ‌లైకా అరోరాఖాన్ - ఆర్భాజ్ ఖాన్ విడాకుల వ్య‌వ‌హారం తెలిసిందే. 2016లోనే ఈ జంట ఒక‌రినుంచి ఒక‌రు విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఏడాది ఆల‌స్యంగా ఆ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. అప్ప‌టి నుంచి మీడియా నానా హంగామా చేసింది. ఆ ఇద్ద‌రి విడాకుల‌కు ర‌క‌ర‌కాల కార‌ణాలు ఉన్నాయ‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. విడాకుల టైమ్ కి 17 ఏళ్ల కుమారుడు ఉన్నాడు ఈ జంట‌కు.

ఇక విడిపోయే క్ర‌మంలోనే ఆర్భాజ్ ఖాన్ విదేశీ యువ‌తి ఆండ్రియానాతో జంట‌గా ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌గా.. మ‌లైకా యువ‌హీరో అర్జున్ క‌పూర్ తో ప్రేమాయ‌ణం సాగించ‌డం హాట్ టాపిక్ అయ్యింది. ఆర్భాజ్ నుంచి విడిపోవ‌డానికి కార‌ణ‌మేమిటో మ‌లైకా ఇదివ‌ర‌కూ ర‌క‌ర‌కాల కోణాల్ని వెల్ల‌డించింది. క‌లిసి ఉండ‌డం క‌ష్టం అనుకున్న త‌ర్వాత‌నే ఇక దూరం అయ్యేందుకు నిశ్చ‌యించుకున్నామ‌ని తెలిపారు. అర్జున్ తో ఎంతో సౌక‌ర్యంగా సంతోషంగా ఉన్నాన‌ని మ‌లైకా బ‌హిరంగంగానే ఇంట‌ర్వ్యూల్లో అంగీక‌రించారు. అయితే పెళ్లి గురించిన ఆలోచ‌న లేద‌ని వెల్ల‌డించారు.

ఇక ఆర్భాజ్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ``అంతా బావుంది అనుకుంటుండ‌గానే ఇలా అయ్యింది`` అని అన్నాడు. ఇక తాజాగా ముంబైలో జ‌రిగిన ఓ ఇంట‌ర్వ్యూలో రిపోర్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు ఆర్భాజ్ ఎంతో వ్యంగ్యంగా స్పందించాడు. ఇంత‌కీ అత‌డు ఏ ప్ర‌శ్న అడిగాడు? అంటే.. మ‌లైకా నుంచి మీరు విడిపోవ‌డానికి కార‌ణం యంగ్ హీరో అర్జున్ క‌పూర్ క‌దా? అని ప్ర‌శ్నించాడు. దానికి ఏమాత్రం త‌డ‌బ‌డ‌ని ఆర్భాజ్.. ``పా.. జీ .. నువ్వు చాలా ఇంటెలిజెంట్ ప్ర‌శ్న అడిగావు. ఈ ప్ర‌శ్న అడిగేందుకు రాతిరంతా ఆలోచించే ఉంటావు క‌దా!! అంటే చాలా టైమ్ తీసుకున్నారు మీరు. స‌మాధానం ఇవ్వ‌డానికి నాక్కొంచెం టైమిస్తార‌నే అనుకుంటున్నా`` అని స్పందించాడు.