Begin typing your search above and press return to search.
ఏ భర్త చేయని విధంగా 21 ఏళ్ల పాటు..!
By: Tupaki Desk | 30 Oct 2018 7:32 AM GMTబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ గత ఏడాది మలైకా అరోరాకు విడాకులు ఇచ్చిన విషయం తెల్సిందే. వీరిద్దరు కలిసి ఉండేందుకు కుటుంబ సభ్యులు చాలా ప్రయత్నాలు చేశారట. కాని ఇద్దరు కూడా విడిపోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో గత ఏడాదిలో కోర్టు వీరికి అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. వీరికి ఒక కొడుకు కూడా ఉన్న విషయం తెల్సిందే. కొడుకు కోసం ఇద్దరు అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నారు. విడాకుల గురించి ఇన్నాళ్లు పెద్దగా నోరు విప్పని అర్బాజ్ ఖాన్ మొదటి సారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
తాజాగా ఒక టాక్ షోలో మాట్లాడిన అర్బాజ్ ఖాన్ విడాకుల విషయమై కాస్త ఎమోషనల్ అయ్యాడు. మలైకా అరోరాతో తాను 21 ఏళ్ల పాటు సర్దుకు పోయి కాపురం చేశాను. ఏ భర్త కూడా ఇంతలా సర్దుకు పోయేందుకు ప్రయత్నించి ఉండడు. 21 ఏళ్ల పాటు సర్దుకు పోయినా కూడా ఆమె పెద్దగా సపోర్ట్ చేయలేదు. భార్య భర్తల బందం ఇద్దరి వైపు నుండి ఉన్నప్పుడు మాత్రమే అది బలంగా ఉంటుందని, ఒకరు మాత్రమే దాన్ని కొనసాగించాలనుకుంటే సాధ్యం కాదని అర్బాజ్ ఖాన్ అన్నాడు. ఆమెకు అర్జున్ కపూర్ తో సంబంధం ఉన్న కారణంగానే అర్బాజ్ ఖాన్ విడాకులు ఇచ్చి ఉంటాడు అంటూ వచ్చిన వార్తలకు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చుతున్నాయి.
గత ఏడాది అధికారికంగా విడాకులు తీసుకున్న వీరిద్దరు ప్రస్తుతం వేరు వేరుగా కొత్త భాగస్వాములతో జీవనం సాగిస్తున్నారు. అర్బాజ్ ఖాన్ ఇప్పటికే మోడల్ జార్జియాతో సహజీవనం సాగిస్తున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరో వైపు అర్జున్ కపూర్ ను త్వరలో మలైకా అరోరా వివాహం చేసుకునేందుకు సిద్దంగా ఉందని ప్రచారం జరుగుతుంది. అర్జున్ కపూర్‌తో తన రిలేషన్ షిప్ గురించి మాత్రం మలైకా అరోరా అధికారికంగా ప్రకటించడం లేదు. ఇటీవలే ఒక పార్టీలో అర్జున్ కపూర్, మలైకా అరోరాలు జంటగా హజరయ్యారు. కానీ ఇద్దరి రిలేషన్ షిప్ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.