Begin typing your search above and press return to search.

ఫోటోలు పెడితే ఎఫైర్ ఉన్నట్లేనా?

By:  Tupaki Desk   |   7 Nov 2016 3:30 PM GMT
ఫోటోలు పెడితే ఎఫైర్ ఉన్నట్లేనా?
X
తన భార్య స్నేహితురాలితో ఫోటోలు దిగిననంత మాత్రాన్న ఆమెతో కనెక్షన్స్ ఉన్నాయని రాసేసారా.. రేపు ఇంకొకరితో ఫోటోలు దిగుతాను అప్పుడూ రూమర్స్ రాసేస్తారా.. అని ప్రశ్నిస్తున్నాడు సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్. ఈమధ్య తనపైనా తన భార్య స్నేహితురాలిపైనా రూమర్స్ పెరిగిపోయాయని, తమ ఇద్దరికీ ఏవో ఉన్నాయని తెగ రాసేస్తున్నారని అర్భజ్ ఖాన్ సీరియస్ అయ్యాడు.. అలాంటిదేమైనా ఉంటే సీక్రెట్ గా చేస్తాను కాని ఇలా ఫోటోలు ఎందుకు పెడతానని ఎదురుప్రశ్నిస్తున్నాడు!

వివరాళ్లోకి వస్తే... తన భార్య మలైకా అరోరా స్నేహితురాలు యెల్లో మెహ్రాతో తాను సన్నిహితంగా ఉంటున్నట్టు ఇచ్చిన వార్తలను తోసిపుచ్చాడు అర్బజ్ ఖాన్. తన సినిమాల గురించి అడిగేందుకు అందరికీ అర్హత ఉంది కానీ... తన వ్యక్తిగత జీవితం గురించి వ్యాఖ్యానించే హక్కు ఏ ఒక్కరికీ లేదని చెబుతున్నాడు. తాజాగా ప్రముఖ ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాలపై అర్బజ్ స్పందించాడు. తమ వ్యక్తిగత జీవితం గురించి ఇష్టమొచ్చినట్టు రూమర్లు రాస్తున్నారని, తద్వారా తమని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారని అంటున్నాడు. సోషల్ మీడియా ఉంది కాబట్టి, దీని ద్వారా కొంతవరకు మా వెర్షన్ వినిపించగలుగుతున్నామని వాపోతున్నారు!

ఈ సమయంలో తన భార్య స్నేహితురాలు యెల్లో మెహ్రా తనకు కూడా మంచి స్నేహితురాలు అని, ఆమెతో కలిసి ఫొటో దిగితే ఇద్దరి మధ్య ఏదో ఉందని రాసేస్తారా? తాను రేపు 50 మంది ఫ్రెండ్స్ తో కలిసి ఫొటోలు తీసుకుంటే వారందరితో కూడా సంబంధం అంటగడతారా? సంతోషంగా స్నేహితులతో ఫొటో దిగే హక్కు కూడా లేదా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడూ. ఈ సమయంలో మరో కీలక వ్యాఖ్య కూడా చేశాడు అర్బజ్. "ఒకవేళ నిజంగా మెహ్రాతో నాకు సీక్రెట్ ఎఫైర్ ఉంటే.. ఆమెతో ఉన్న ఫోటోలను ఎందుకు బయటపెడతాను" అని! కాగా, ప్రస్తుతం తెలుగులో వంశీకృష్ణ తెరకెక్కిస్తున్న సినిమాలో అర్బజ్ నటిస్తున్నాడు. అంతకముందు "జై చిరంజీవి" సినిమాలో అతడు నటించిన విషయం తెలిసిందే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/