Begin typing your search above and press return to search.

ఈ కొత్త గాళ్ ఎవరు మెగా విలన్‌?

By:  Tupaki Desk   |   22 July 2016 3:03 PM GMT
ఈ కొత్త గాళ్ ఎవరు మెగా విలన్‌?
X
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్.. టాలీవుడ్ లో పదేళ్ల క్రితమే ప్రవేశించాడు. జై చిరంజీవ అంటూ చిరంజీవికి విలన్ గా నటించిన ఈ బాలీవుడ్ యాక్టర్ రియల్ లైఫ్.. ఇప్పుడు రకరకాలుగా టర్న్ అవుతోంది. పవన్ గబ్బర్ సింగ్ లో ఐటెం సాంగ్ చేసిన మలైకా అరోరా ఖాన్ భర్తే ఈ అర్బాజ్ ఖాన్.

వీళ్లిద్దరూ విడిపోతున్నారనే న్యూస్ కొన్ని నెలలుగా బాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇప్పటికే ఎవరికి వారే విడిగా ఉంటున్నారు కూడా. ఇప్పుడీ అర్బాజ్ ఖాన్.. ఓ యంగ్ లేడీతో కలిసి గోవాలో చక్కర్లు కొడుతూ కనిపించాడు. ఈమె ఎవరో కాదు.. ఫియెస్టా హాస్పిటాలిటీ గ్రూప్ ఫౌండర్ యెల్లో మెహ్రా. ఈమె ఓ మోడల్ కం చెఫ్ కం ఇంటీరియర్ డిజైనర్ కూడా. ఈమెతో కలిసి మంచి క్లోజ్ గా ఉన్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన అర్బాజ్ ఖాన్.. మంచి కంపెనీ అని గ్రేట్ టైమ్ స్పెండ్ చేశామంటూ పోస్ట్ చేశాడు కూడా.

చూస్తుంటే వీళ్లిద్దరి రిలేషన్ మరో మెట్టు ముందుకెళ్లినట్లే కనిపిస్తోంది. అయితే.. రీసెంట్ గా సల్మాన్ ఇచ్చిన ఈద్ పార్టీలో మాత్రం అర్బాజ్, మలైకాలు ఇద్దరూ కలసి సందడి చేయడం విశేషం. మరోవైపు తన పిల్లలతో కలిసి మాల్దీవ్స్ లో ఒక్కతే టూర్ లో ఉంది మలైకా అరోరా ఖాన్.