Begin typing your search above and press return to search.
ఇంటెన్స్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉన్న 'అర్థ శతాబ్దం' టీజర్..!
By: Tupaki Desk | 26 Jan 2021 11:20 AM GMT'కేరాఫ్ కంచెరపాలెం' ఫేమ్ కార్తిక్ రత్నం - నవీన్ చంద్ర - కృష్ణ ప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "అర్ధ శతాబ్దం". 'ది డెమోక్రటిక్ వైలెన్స్' అనేది దీనికి ఉపశీర్షిక. రవీంద్ర పుల్లే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వీర్ ధాత్మిక్ సమర్పణలో రిషిత శ్రీ క్రియేషన్స్ మరియు 24 ఫ్రేమ్స్ సెల్యూలాయిడ్ పతకాలపై చిట్టి కిరణ్ రామోజు - రాధాకృష్ణ.టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ గ్లిమ్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో నేడు రిపబ్లిక్ డే సందర్భంగా 'అర్ధ శతాబ్దం' టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్ర టీజర్ ని విడుదల చేశాడు.
'న్యాయం, ధర్మం అవుతుంది కానీ.. ధర్మం ఎల్లప్పుడూ న్యాయం కాదు' అనే వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ప్రారంభమైంది. ఇందులో కార్తీక్ రత్నం.. టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. 'యుద్ధమే ధర్మం కానప్పుడు ధర్మ యుద్ధాలు ఎక్కడివి?'.. 'ఈ స్వతంత్ర దేశంలో గణతంత్రం ఎవడికో ఎందుకో? దేనికో?' అంటూ వచ్చే డైలాగ్స్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. దీనికి నౌఫల్ రాజా(ఎ.ఐ.ఎస్) అద్భుతమైన నేపథ్య సంగీతం అందించాడు.
అష్కర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు. జె. ప్రతాప్ కుమార్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఇంటెన్స్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 'అర్ధ శతాబ్దం' సినిమాలో సాయి కుమార్ - అజయ్ - సుహాస్ - శుభలేఖ సుధాకర్ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు.